సూర్య నమస్కారాలతో ఆరోగ్యం, ఫిట్నెస్.. రెండూ సాధ్యమే అంటున్న యోగా నిపుణులు
‘రోజుకు కనీసం అరగంటైనా ఏదో ఒక వ్యాయామం చేయాలి’.. ఉరుకుల పరుగుల కెరీర్ జీవులకు ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహా. నిజమే! ఎడతెగని పని, సమావేశాలు, ఈ-మెయిల్స్‌తో ఉద్యోగాల్లో తలమునకలు అయ్యేవారికి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు పట్టుమని పది నిమిషాలు కూడా దొరకడం లేదు.
‘రోజుకు కనీసం అరగంటైనా ఏదో ఒక వ్యాయామం చేయాలి’.. ఉరుకుల పరుగుల కెరీర్ జీవులకు ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహా. నిజమే! ఎడతెగని పని, సమావేశాలు, ఈ-మెయిల్స్‌తో ఉద్యోగాల్లో తలమునకలు అయ్యేవారికి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు పట్టుమని పది నిమిషాలు కూడా దొరకడం లేదు. దీంతో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు తదితర జీవనశైలి రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా గుండెజబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటివారికి.. సూర్య నమస్కారాలతో ఆరోగ్యం, ఫిట్నెస్ రెండూ సాధ్యమే అంటున్నారు యోగా నిపుణులు. వివిధ ఆసనాలతో కూడిన సూర్య నమస్కార ప్రక్రియ శరీరంలో ప్రతీ అవయవం మీద ప్రభావం చూపుతుంది. పైగా వీటిని ఎక్కడైనా, ఎప్పుడైనా..
ఎలాంటి పరికరాల అవసరం లేకుండా వేయవచ్చు. సూర్య నమస్కారాలు శరీరం మొత్తానికి వ్యాయామాన్ని అందిస్తాయి. యోగాసనాలతో పోలిస్తే తక్కువ సమయం పడుతుంది. సూర్య నమస్కారంలో పన్నెండు ప్రధాన ఆసనాలు ఉంటాయి. ఇవి శరీరం, మనసు రెండిటికీ ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించినవి. శరీరంలోని వివిధ కండరాల బలోపేతానికి వీలు కల్పిస్తాయి. శరీరంలో ప్రాణశక్తి ప్రేరణకు దోహదపడతాయి. అలా మన మానసిక, శారీరక శక్తుల్ని క్రమబద్ధం చేయడంలో శరీరానికి సహకరిస్తాయి. సూర్య నమస్కారాలను రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. అయితే, సూర్యోదయ సమయంలో మరీ ఉత్తమం. ఉదయం వేళల్లో ఆదిత్యుడికి అభిముఖంగా సాధన చేయడం వల్ల సూర్య కిరణాలు మన శరీరాన్ని, మనసును పునరుత్తేజితం చేస్తాయి.శరీరంలో పేరుకుపోయిన కెలోరీలను బాగా ఖర్చు చేయాలంటే రోజూ 108 సూర్య నమస్కారాలు చేయాలని అంటారు.

- రక్త ప్రసరణ, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
- గుండెను బలోపేతం చేస్తాయి.
- ఉదర కండరాలు, శ్వాస వ్యవస్థ, శోషరస వ్యవస్థ, వెన్ను నాడులు, ఇతర అవయవాలను ప్రేరేపిస్తాయి.
- శరీరాన్ని క్రమబద్ధం చేస్తాయి.
- బరువు తగ్గడానికి సాయపడతాయి.
- కండరాలు, కీళ్లను బలోపేతం చేసి శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతాయి.
- శరీరం, శ్వాస, మెదడు మధ్య అనుసంధానాన్ని క్రమబద్ధం చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

