Diabetes | డయాబెటిస్ ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇన్పులిన్ ను తీసుకుంటారు. ఇన్పులిన్ తీసుకున్నప్పటికీ చాలా మందిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ డయాబెటిస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండడానికి అనేక అంశాలు దారి తీస్తాయి. కనుక ఇన్సులిన్ తీసుకునే మోతాదుపై శ్రద్ద వహించడం చాలా అవసరం. ఇక ఇన్సులిన్ తీసుకోవడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి గల ఇతర కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. డయాబెటిస్ నిర్వహణలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, సరైన ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలను, జంక్ ఫుడ్ ను, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. మన జీవనశైలికి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేలా భోజన ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చేపలు వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. అలాగే డయాబెటిస్ అదుపులో ఉన్నా లేదా అసలు లేకపోయినా కూడా రోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల రక్తంలో అదనంగా ఉండే చక్కెర స్థాయిలు తొలగించబడతాయి. వ్యాయామం చేయకపోవడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు మితమైన వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
అలాగే ఒత్తిడి ఇన్సులిన్ విడుదల అవ్వకుండా అడ్డుకుంటుంది. దీంతో ఇన్సులిన్ తీసుకున్నప్పటికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. ఎంత ఒత్తిడికి గురైతే రక్తంలో చక్కెర స్థాయిలు అంత పెరుగుతూనే ఉంటాయి. ఇన్సులిన్ మోతాదు పని చేయకుండా పోతుంది. అందువల్ల ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు వాడే మందుల వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. స్టెరాయిడ్స్, మందులు, ఆందోళన, నిరాశ, మానసిక సమస్యలకు వాడే మందులు, జనన నియంత్రణ మాత్రలు, బీటా బ్లాకర్లు , బి విటమిన్ క్యాప్సుల్స్ వంటివి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కనుక వీటిని తీసుకునే ఉత్తమ మార్గాలను అన్పేషించడం మంచిది.
అలాగే ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడేటప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇన్సులిన్ ను తీసుకున్నప్పటికి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇలా వివిధ కారణాల వల్ల ఇన్సులిన్ ను తీసుకున్నప్పటికి రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కనుక చక్కెర స్థాయిలు అధికంగా ఉండడానికి గల కారణాలను తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.