diabetes | డయాబెటిస్ ఉంటే పెళ్లి తర్వాత ఈ విషయాల్లో ఇబ్బందులే !!

diabetes | రోజురోజుకూ చికిత్సా విధానాలు సులువుగా, సమర్థంగా మారుతున్నాయి. ఒకవేళ డయాబెటిస్ దశకు చేరుకొన్నా.. సరైన మందులు వాడుతూ, అణువంతైనా రాజీ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి, పెళ్లికి ముందు మధుమేహం బయటపడుతుందేమోనన్న అశ్రద్ధ వద్దు. ఒకవేళ బయటపడ్డా, దాన్ని దాచాల్సిన అగత్యమూ లేదు. అలాగే, డయాబెటిస్ ఉన్నవారిని వివాహం చేసుకొనేందుకు, వారితో కలిసి జీవించేందుకూ భయపడక్కర్లేదు. కాకపోతే వివాహానికి ముందు వైద్యుడి దగ్గర కౌన్సిలింగ్ తీసుకొంటే మంచిది. మధుమేహంతో మెలగడం ఎలాగో తెలిసిపోతుంది.
సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారి వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలివి. రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటే.. చిన్నాచితకా ఇబ్బందులు కూడా ఆమడదూరంలోనే ఉండిపోతాయి. ఏ సమస్యా ఉండదు.

శృంగార జీవితం
చక్కెర నిల్వలు ఎక్కువైనప్పుడు నరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా అంగస్తంభన లేకపోవడం, శీఘ్రస్కలనం లాంటి సమస్యలు వస్తాయి. ఒకటిరెండుసార్లు ఇలా జరిగితే తనమీద తనకు నమ్మకం పోయి, మున్ముందు కూడా ఇబ్బంది పడతారు. మహిళల్లో కూడా అధిక చక్కెర వల్ల చర్మం పొడిబారిపోయి, కలయిక బాధగా మారవచ్చు.

సంతానం
మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువ కావడం, ఉన్నవి కూడా బలహీనపడటం వల్ల సంతానం కష్టమవుతుంది. ఇక మహిళల్లో అధిక చక్కెర, దాంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఫాలోపియన్ ట్యూబుల్లో అడ్డంకులు ఏర్పడటం, రుతుక్రమం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ గర్భం దాల్చినా అది నిలవలేని ప్రమాదం ఉంటుంది.

భావోద్వేగాలు
రక్తంలో చక్కెర నిల్వలు మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా అవి రక్తప్రసరణ మీదా.. అది మెదడుకు, గుండెకు అందించే శక్తి మీదా ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకుపరాకులు వస్తాయి. రోజువారీ జీవితంలో వచ్చే ప్రతి చిరాకుకూ షుగర్‌తో ముడిపెట్టడం భావ్యం కాదు కానీ, మన స్పందన అసహజంగా తోస్తే మాత్రం చక్కెర అదుపులో ఉందో లేదో గమనించుకోవాల్సిందే!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పక్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..
Health Tips |శృంగారంలో పాల్గొనడం ఒక్కసారిగా ఆపేస్తే అంత ప్రమాదామా?
మగాళ్లు రోజూ కుంకుమ పువ్వు తింటే ఏమవుతుంది.. తెలిస్తే షాకవుతారు!
ఇయర్ బడ్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

