Dates and Heart | గుండె ఆరోగ్యానికి ఖర్జూరం.. నిత్యం ఎన్ని తినాలంటే..?
Dates and Heart | ఖర్జూరం.. మన ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్. సరైన సమయంలో, సరైన రీతిలో తినడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు.
Dates and Heart | ఖర్జూరం.. మన ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్. చూడగానే నోట్లో వేసుకుని నమిలేయాలని అనిపిస్తుంది. అంతలా ఆకట్టుకునే ఖర్జూరాలు మినరల్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలతో నిండి ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి. వీటిలో 23 అమైనో యాసిడ్స్, పాల్మిటోలిక్, ఒలీక్, లినోలెయిక్, లినోలెనిక్ యాసిడ్ వంటి అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండి శరీరానికి తక్షణ ఎనర్జీని అందిస్తాయి. సరైన సమయంలో, సరైన రీతిలో తినడం ద్వారా ఎన్నో సమస్యలను అధిగమించవచ్చునంటున్నారు పోషకాహార నిపుణులు.
ఖర్జూరా పండ్లలోని ‘ఏ, బీ’ విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. ఇందులోని పొటాషియం, కాల్షియం ఇంకా మెగ్నీషియం ఎముకల పటుత్వానికి బాగా దోహదపడతాయి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడేవారు ఈ పండ్లు తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం పొందవచ్చు. వీటిలోని పీచుపదార్థం ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యలు దూరం చేస్తుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుకోవచ్చు.
గుండె వైఫల్యానికి చికిత్స చేయడంలో ఖర్జూరాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరాలను రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకోవడం చాలా మంచిది. నిత్యం 3 ఖర్జూరాలు తినడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మంచి ఫలితాలు రాబట్టేందుకు వారం రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు గుండె ధమని కణాల నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె పోటు, హైపర్‌టెన్షన్, స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. హార్ట్ బీట్‌ను నార్మల్‌గా ఉంచడంలో సహకరిస్తుంది.
వీటని నిత్యం తినడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు ఎముకలు దృఢంగా తయారవడంలో, స్పెర్మ్ కౌంట్ పెరగడంలో, జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడంలో, కోలన్ క్యాన్సర్ రాకుండా కాపాడటంలో గ్రేట్‌గా పనిచేస్తాయి. ఖర్జూరంలో మాత్రమే ఉండే ఫెనాల్ క్లాస్ యాసిడ్స్ రోగనిరోధక శక్తి సక్రమంగా పని చేసేలా చేస్తుంది. రోజుకు 2 ఖర్జూరాలు తీసుకుంటే రక్తంలో షుగర్ 15 శాతం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

