ఆరోగ్యం కోసం రోజుకు రెండు గుడ్లు
పిడికెడంత గుడ్డులో పుష్కలమైన పోషకాలు. పుట్టెడు రోగాలు పోవాలంటే గుప్పెడు మాత్రలు మింగడం కాదు, రోజూ రెండు గుడ్లు తినాలంటారు పోషకాహార నిపుణులు. వాటి ద్వారా శరీరానికి కావాల్సిన 13 గ్రాముల ప్రొటీన్, 9.5 గ్రాముల కొవ్వు, 56 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 1.8 మిల్లీ గ్రాముల ఐరన్ లభిస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే..
పిడికెడంత గుడ్డులో పుష్కలమైన పోషకాలు. పుట్టెడు రోగాలు పోవాలంటే గుప్పెడు మాత్రలు మింగడం కాదు, రోజూ రెండు గుడ్లు తినాలంటారు పోషకాహార నిపుణులు. వాటి ద్వారా శరీరానికి కావాల్సిన 13 గ్రాముల ప్రొటీన్, 9.5 గ్రాముల కొవ్వు, 56 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 1.8 మిల్లీ గ్రాముల ఐరన్ లభిస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే..
- మెదడు కణాల మధ్య సమాచార మార్పిడికి ఉపయోగపడే ఫాస్పోలిపిడ్స్ గుడ్డులో పుష్కలం. దీనివల్ల మెదడు నిర్మాణం, పనితీరు మెరుగ్గా ఉంటుంది.
- గుడ్డులో విటమిన్-డి అపారం. దీనివల్ల ఎముకలకు క్యాల్షియంను గ్రహించే శక్తి పెరుగుతుంది. పళ్లు బలంగా తయారవుతాయి.
- కోడిగుడ్లలో ల్యూటిన్ అధికం. ఇది కంటి చూపు స్పష్టంగా, చురుకుగా ఉండేలా చేస్తుంది. వయసుతోపాటు వచ్చే దృష్టిలోపాలనూ సరిచేస్తుంది.
- గుడ్డులోని ఫాస్పోటైడ్స్ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నియంత్రిస్తాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లం ట్రైగ్లిసరైడ్స్ను పరిమితిలో ఉంచుతుంది. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు రావు.
- గుడ్డులో కార్బొహైడ్రేట్స్ తక్కువ. కాబట్టి, అధిక బరువు ఉన్నవాళ్లు ఉదయం పూట గుడ్డుతో చేసిన వంటకాలను తింటే కొంతమేర బరువు తగ్గొచ్చు. దానికి వ్యాయామమూ తోడవ్వాలి.
- చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి దోహదపడే ఫాస్పోలిపిడ్స్ గుడ్డులో ఉంటాయి. రోజుకు రెండు గుడ్లు తినేవాళ్ల చర్మం మృదువుగానూ, ఆరోగ్యవంతంగానూ ఉంటుంది. గుడ్డులోని బయోటిన్, విటమిన్-బి12, ప్రొటీన్ల వల్ల చర్మం కాంతిమంతం అవుతుంది.
- రోజూ రెండు గుడ్లు తినేవాళ్లలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం 18 శాతం తక్కువని ఓ అధ్యయనంలో గుర్తించారు. లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడే బి విటమిన్లు గుడ్డులో అధికం. ఇందులోని ఫోలిక్ యాసిడ్ రక్త కణాల తయారీతోపాటు గర్భస్థ పిండాల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. తల్లీబిడ్డలకు రక్షణనిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

