Copper | కాపర్‌ను తరచూ తీసుకుంటే మెదడు ఆరోగ్యం పదిలం.. అధ్యయనాల్లో వెల్లడి..
మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా శరీరానికి అవసరమైన సూక్ష్మ ఖనిజాల్లో ఒకటైన కాపర్ (రాగి) మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఇప్పటికే తెలిసిన విషయమే.
Copper | మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా శరీరానికి అవసరమైన సూక్ష్మ ఖనిజాల్లో ఒకటైన కాపర్ (రాగి) మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఇప్పటికే తెలిసిన విషయమే. తాజాగా వెలువడిన ఓ ప్రయోగాత్మక అధ్యయనం ప్రకారం, నియంత్రిత మోతాదులో కాపర్‌ను ఉపయోగించడం వల్ల మెదడులో పేరుకుపోయే హానికరమైన ప్రోటీన్లను తగ్గించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, దీనిని ప్రస్తుతం చికిత్సగా పరిగణించరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అల్జీమర్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల్లో మెదడులో విషపూరిత ప్రోటీన్లు పేరుకుపోవడం ప్రధాన కారణంగా భావిస్తారు. ఈ ప్రోటీన్లు మెదడు కణాల మధ్య సమాచార మార్పిడిని దెబ్బతీసి జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తాజా ప్రయోగశాల అధ్యయనంలో నియంత్రిత మోతాదులో కాపర్ ఇవ్వడం వల్ల మెదడు కణాల మధ్య సమాచార ప్రసారం మెరుగుపడటంతోపాటు హానికరమైన ప్రోటీన్ల ప్రభావం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
మెదడు పనితీరుకు కీలకం..
కాపర్ శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యే సూక్ష్మ ఖనిజం. ఇది మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును మెరుగుపరచడం, వివిధ ఎంజైమ్‌ల కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. అలాగే మెదడు కణాలను రక్షించే న్యూరోప్రొటెక్టివ్ పాత్ర కూడా పోషిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే శరీరంలో కాపర్ మోతాదు సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యం. కాపర్ ఎక్కువైనా, తక్కువైనా మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాపర్ అసమతుల్యత వల్ల ఆక్సిడేటివ్ ఒత్తిడి పెరిగి మెదడు కణాలు దెబ్బతినడం, న్యూరో ఇన్ఫ్లమేషన్ పెరగడం, కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. మెదడులోని ప్రోటీన్లు సాధారణంగా నాడీ వ్యవస్థ పనితీరుకు అవసరమైనవే. కానీ బీటా-అమిలాయిడ్, టావు వంటి కొన్ని ప్రోటీన్లు అసాధారణంగా పేరుకుపోతే అవి విషపూరితంగా మారి మెదడు కణాల మధ్య సమాచార మార్పిడిని అడ్డుకుంటాయి. అల్జీమర్స్ వ్యాధిలో ఈ ప్రోటీన్లు పేరుకుపోవడాన్ని ప్రధాన లక్షణంగా గుర్తించారు. తాజా పరిశోధనలు కాపర్ థెరపీ ద్వారా ఈ ప్రక్రియను కొంతవరకు నియంత్రించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.
జంతువులపై మాత్రమే అధ్యయనాలు..
అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలు ప్రయోగశాలల్లో జంతువులపై నిర్వహించిన అధ్యయనాలకే పరిమితమయ్యాయి. మానవుల్లో ఇదే ఫలితాలు వస్తాయో లేదో నిర్ధారించడానికి మరిన్ని క్లినికల్ అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల కాపర్ థెరపీని ఇప్పుడే అల్జీమర్స్ లేదా ఇతర మెదడు వ్యాధులకు నిర్ధారిత చికిత్సగా భావించలేమని స్పష్టం చేస్తున్నారు. కాపర్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం కూడా ప్రమాదకరమే. అధిక కాపర్ వల్ల శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడంతోపాటు విషపూరిత ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వైద్యుల సలహా లేకుండా కాపర్ సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమతుల్య ఆహారం కీలకం..
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. గింజలు, విత్తనాలు, సంపూర్ణ ధాన్యాలు వంటి కాపర్ కలిగిన సహజ ఆహారాలను మితంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. స్వయంగా సప్లిమెంట్లు వాడకుండా, అవసరమైతే వైద్యుల సలహాతో మాత్రమే వాటిని ఉపయోగించడం సురక్షితం. అయితే కాపర్ మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నప్పటికీ, అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో లేదా చికిత్స చేయడంలో ఇది ఎంతవరకు ప్రభావవంతమో చెప్పడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, వైద్యుల సూచనలు పాటించడమే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉత్తమ మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

