Cervical Cancer | తొలిదశలో గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడం ఎలా ?
Cervical Cancer | పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్ కావచ్చు. కేంద్ర బడ్జెట్లో టీకాల ప్రస్తావన కావచ్చు. ఒక్కసారిగా సర్వికల్ క్యాన్సర్ గురించి చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ ఎందుకింత ప్రాణాంతకం అవుతున్నది అనే అధ్యయనమూ మొదలైంది.
Cervical Cancer | పూనమ్ పాండే పబ్లిసిటీ స్టంట్ కావచ్చు. కేంద్ర బడ్జెట్లో టీకాల ప్రస్తావన కావచ్చు. ఒక్కసారిగా సర్వికల్ క్యాన్సర్ గురించి చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో సర్వికల్ క్యాన్సర్ ఎందుకింత ప్రాణాంతకం అవుతున్నది అనే అధ్యయనమూ మొదలైంది. తొలిరోజుల్లో పసిగట్టకపోవడమే ఈ మహమ్మారి విజృంభణకు అసలు కారణమని గుర్తించారు నిపుణులు. లక్షణాలను కనిపెట్టి, సరైన వైద్యుడిని సంప్రదిస్తే తొలిదశలోనే సమర్థమైన చికిత్స సాధ్యమంటున్నారు.
- రుతుస్రావ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం, రోజుల తరబడి రక్తస్రావం కొనసాగడం.
- పీరియడ్స్ మధ్యలో, బహిష్టు తర్వాత కూడా రక్తస్రావం.
- రక్తం రంగు మారుతూ దుర్వాసనతో కూడిన స్రావాలు వెలువడటం.
- గర్భాశయం దగ్గర నొప్పి, దురద.
- మూత్రానికి వెళ్లినప్పుడు, రతి సమయంలో అసౌకర్యం.
ఈ లక్షణాలు ఇతర రుగ్మతల్లోనూ కనిపించవచ్చు. అదే సమయంలో గర్భాశయ క్యాన్సర్‌కు సూచనగానూ భావించాలి. తొమ్మిది నుంచి పద్నాలుగేండ్ల వయసులో వ్యాక్సిన్ వేయించుకోవడం, పాతికేండ్ల వయసు వచ్చిన తర్వాత ప్రతి మూడు నుంచి ఐదేండ్లకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమం అని సలహా ఇస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

