Health Tips | బరువు తగ్గేందుకు మేలైన ఎంపికగా పలువురు సలాడ్స్‌ను ఆశ్రయిస్తుంటారు. వీటిలో ఫైబర్, నీరు అధికంగా ఉండటంతో అదనపు క్యాలరీలు తీసుకోకుండానే కడుపు నిండిన భావన కలుగుతుంది. క్యారెట్స్ సహా దాదాపు అన్ని కూరగాయలను సలాడ్స్‌లో వాడవచ్చు.
సీజన్లతో నిమిత్తం లేకుండా అన్ని వేళలా సులభంగా లభ్యమయ్యే క్యారెట్స్ పోషకాల గనిగా పేరొందింది. బరువు తగ్గేందుకు క్యారెట్ సలాడ్స్‌కు మించినవి లేవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సహా అత్యవసర పోషకాలు మెండుగా ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు క్యారెట్స్, సలాడ్స్‌ను ఇష్టపడేవారు ఐదు రకాల క్యారెట్ సలాడ్స్‌ను ట్రై చేయవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముందుగా క్లాసిక్ క్యారెట్ కుకుంబర్ సలాడ్ చేసుకోవచ్చు. క్యాలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండే క్యారెట్ కుకుంబర్ సలాడ్ బరువు తగ్గాలనుకునే వారికి మేలైన ఎంపిక. ఈ సలాడ్‌లో క్యారెట్, కీరాలతో పాటు తేనె, పెప్పర్, నిమ్మ రసం వాడితే రుచిగా ఉంటుంది. ఇక ఐదు రకాల క్యారెట్ సలాడ్స్‌ను పరిశీలిస్తే..
క్లాసిక్ క్యారెట్ కుకుంబర్ సలాడ్
స్పైసీ క్యారెట్, టమాట సలాడ్
క్యారెట్, బీట్రూట్ సలాడ్
క్యారెట్ స్ప్రౌట్స్ సలాడ్
క్యారెట్, లెంటిల్ సలాడ్
Read More :
Electric shock | పర్దీపూర్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి