న్యూఢిల్లీ : బరువు తగ్గడం నుంచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను (Health Tips) అందించే స్పైస్‌గా యాలకులు పేరొందాయి. తాజా శ్వాస కోసం మౌత్ ఫ్రెషనర్‌గా భారతీయులు ఎప్పటినుంచో యాలకులను వాడుతున్నారు. యాలకులను కూరలు సహా పలు దేశీ వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. యాలకులతో పాటు వీటితో తయారుచేసిన నూనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
యాలకులతో అధిక రక్తపోటును నియంత్రించవచ్చని చెబుతున్నారు. అధిక రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉండటంతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. బీపీ లెవెల్స్‌ను సాధారణ స్ధాయిలో ఉంచేందుకు యాలకులు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. యాలకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్‌తో పాటు ఇతర ఔషధ గుణాలు బీపీని అదుపులో ఉంచుతాయని అంటున్నారు.
యాలకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ ఔషధాలతో గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. శరీరంలో ఉండే అధిక సోడియం, పొటాషియం బయటికి పంపేందుకు యాలకులు ఉపయోగపడతాయి. యాలకులు తరచూ తీసుకోవడం ద్వారా రక్త కణాలు రిలాక్స్ అవడం ద్వారా రక్తపోటు లెవెల్స్ తగ్గుముఖం పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
Read More :