న్యూఢిల్లీ : బరువు తగ్గాలని చాలా మంది ఆహార నియమాలను పాటిస్తూ, జిమ్‌ల్లో (Health Tips) చెమటోడుస్తుంటారు. వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇలా తమకు తోచిన రీతిలో బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో బరువు సులభంగా తగ్గవచ్చని, అయితే ఇది రాత్రికి రాత్రి సాధించే ప్రక్రియ కాదని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గే క్రమంలో ప్రొటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. హై ప్రొటీన్ డైట్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో పాటు బరువు తగ్గేందుకూ ఉపకరిస్తుంది. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారంతో కడుపు నిండిన భావన కలిగి అధిక ఆహారం తీసుకోవడం జరగదు. దీంతో జీవక్రియల వేగం పెరిగి అధికంగా క్యాలరీలు ఖర్చవుతాయి.
బ్రేక్‌ఫాస్ట్‌లో అధికంగా ప్రొటీన్ తీసుకోవడంతో రోజు ప్రారంభించడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో హై ప్రొటీన్ తీసుకుంటే రోజు మొత్తంలో తక్కువ క్యాలరీలు తీసుకుంటారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రొటీన్ డైట్ మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడంతో అదనపు క్యాలరీలు శరీరంలో పేరుకుపోయే అవకాశం ఉండదు. ముఖ్యంగా శాకాహారులకు అయితే సరైన ప్రొటీన్ ఫుడ్‌ను ఎంచుకోవడమే సమస్య. ప్రతిరోజూ ఈ హై ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌లను ట్రై చేసి ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించండి.
శనగల సలాడ్
బేసన్ చీలా
పనీర్ వెరైటీలు
మూంగ్‌దాల్ చీలా
క్వినోవా పనీర్ సలాడ్
Read More :