నీటుగా.. స్వర్గానికి దీటుగా!
చిందరవందరగా ఉన్న గది, డెస్క్ , ఆఫీస్.. మనసునూ చిందరవందర చేస్తాయి అంటున్నారు భారతదేశపు మొట్టమొదటి కాన్‌మరీ సర్టిఫైడ్ మాస్టర్ కన్సల్టెంట్ గాయత్రి గాంధీ. ఇంటిని, ఇంటితోపాటు జీవితాన్ని తీర్చిదిద్దుకునే పాశ్చాత్య కళ పేరే..
చిందరవందరగా ఉన్న గది, డెస్క్ , ఆఫీస్.. మనసునూ చిందరవందర చేస్తాయి అంటున్నారు భారతదేశపు మొట్టమొదటి కాన్‌మరీ సర్టిఫైడ్ మాస్టర్ కన్సల్టెంట్ గాయత్రి గాంధీ. ఇంటిని, ఇంటితోపాటు జీవితాన్ని తీర్చిదిద్దుకునే పాశ్చాత్య కళ పేరే.. కాన్‌మరీ. ‘ఇష్టమైన పనిని వృత్తిగా ఎంచుకుంటే కష్టపడాల్సిన పనే ఉండదు’ అని చెబుతారామె. గాయత్రి జీవన విధానమూ ఇదే.
గాయత్రి సకలకళా వల్లభురాలు. జైపూర్‌లో పుట్టిపెరిగారు. మాస్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేశారు. థియేటర్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉంది. ఫిల్మ్ ఎడిటింగ్ మెలకువలు తెలుసు. డిస్కవరీ చానల్లో కీలక హోదాలో పనిచేశారు. ఇవేవీ ఆమెకు పెద్దగా సంతృప్తిని ఇవ్వలేదు. ఇంటిని, ఆఫీసును, డెస్కును.. ప్రతి వస్తువును, ప్రతి అరను పొందికగా సర్దుకోవడం ఎలాగో చాలామందికి తెలియదు. కొని పడేయడమే వాళ్లకు ఎరుక. దీంతో అప్పటికే కొన్నవి, ఇప్పుడు కొన్నవి, ఎవరో ఇచ్చినవి, ఎవరికోసమో తెచ్చినవి, పాతబడినవి, చిరుగులు పడినవి, శిథిలమైనవి, చెదపురుగుల పాలైనవి, దుమ్ములో మునిగి తేలుతున్నవి, ధూళిలో స్నానం చేస్తున్నవి.. ఇలా రకరకాల పుస్తకాలు, బట్టలు, సామాన్లు గదినంతా ఆక్రమిస్తాయి.
మనం పడుకునేచోటు, కూర్చునేచోటు, పని చేసుకునేచోటు.. ఎంత శుభ్రంగా ఉంటే మనసుకు అంత హాయి. కాబట్టే, ‘చక్కగా సర్దిన ఇల్లు స్వర్గంతో సమానం’ అంటారు గాయత్రి. ఉదాహరణకు.. లక్షలు పోసి నెక్లెస్ కొంటారు. ఏదో ఫంక్షన్లో అలంకరించుకోవాలని అనుకుంటారు. సమయానికి దొరకదు. ఒకవైపు ముహూర్తం మించిపోతూ ఉంటుంది. మరోవైపు ఎవరైనా దొంగిలించారా అనే భయం. దీంతో బీపీ పెరుగుతుంది. జీవిత భాగస్వామి మీద అరిచేస్తారు. ఆ తొందర్లో విలువైన గాజు పాత్ర చేజారి ముక్కలు అవుతుంది. మొత్తానికి నెక్లెస్ దొరికినా..

Cloth Stand
ఆరోగ్యం దెబ్బతింటుంది, బంధాలకు బీటలుపడతాయి. చక్కగా సర్దుకోవడం తెలిసి ఉంటే.. ఎక్కడ ఉండాల్సిన నెక్లెస్ అక్కడే ఉండేది కదా! ఇటీవల ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో గాయత్రి గాంధీ ‘లెట్స్ స్పార్క్ జాయ్’ పేరుతో ఓ సెషన్ నిర్వహించారు. అపరిశుభ్రత ఉన్నచోట నెగెటివ్ శక్తి (భారతీయత ప్రకారం.. అలక్ష్మి) తిష్టవేస్తుంది. శుభ్రంగా, చక్కగా సర్దిన ఇల్లు సాక్షాత్తు లక్ష్మీ నివాసమే. గాయత్రి అభి ప్రాయమూ ఇదే. ‘అవసరం లేనివి వదిలించుకుని, అవసరమైనవి దాచుకోండి’.. అనేది కాన్‌మరీ మూల సూత్రం. ఈ జపనీస్ కాన్‌మరీ కళపై గాయత్రి అంతర్జాతీయ నిపుణుల దగ్గర శిక్షణ పొందారు. కార్పొరేట్ కంపెనీలకు, కుబేర కుటుంబాలకు సలహాదారుగానూ ఉన్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

