Bladder cancer | మగవాళ్ల శత్రువు.. మూత్రాశయ క్యాన్సర్
Bladder cancer | మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువ. దీన్నే ‘యూరోథీలియల్ కార్సినోమా’ అనీ అంటారు. మూత్రాశయ కణాలు పరిమితికి మించి పెరగడం వల్ల వ్యాధి విస్తరిస్తుంది.పురుషులకే ఈ రుగ్మత ముప్పు ఎక్కువని చెబుతారు నిపుణులు.
Bladder cancer | మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువ. దీన్నే ‘యూరోథీలియల్ కార్సినోమా’ అనీ అంటారు. మూత్రాశయ కణాలు పరిమితికి మించి పెరగడం వల్ల వ్యాధి విస్తరిస్తుంది.పురుషులకే ఈ రుగ్మత ముప్పు ఎక్కువని చెబుతారు నిపుణులు.
భారతదేశంలో ప్రబలంగా ఉన్న పదిహేడు రకాల క్యాన్సర్లలో ఇదీ ఒకటి. ఏటా 21,000 మందిలో మూత్రాశయ క్యాన్సర్ నిర్ధారణ జరుగుతున్నది. ఈ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు 50 శాతం మృత్యువాత పడుతున్నారని అంచనా. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో వ్యాధి తీవ్రత మూడు నుంచి నాలుగు రెట్లు అధికం.
లక్షణాలు
- రక్తం కలిసిన, లేదంటే గులాబీ రంగులో మూత్ర విసర్జన. దీన్నే ‘హిమటూరియా’ అంటారు.
- పొట్టలో నొప్పి. ఆ ప్రదేశంలో వ్యాధి విస్తరించింది అనడానికి ఇదొక సంకేతం.
- మూత్ర విసర్జన కష్టంగా, నొప్పితో కూడుకుని ఉండటం. మూత్రంలో మంట. ఈ సమస్యను ‘డిజూరియా’ అంటారు.
- తరచుగా మూత్రం వస్తుంది.
- మూత్రం ఆపుకోలేక పోవడం.
- చర్మం పాలిపోవడం.
- హఠాత్తుగా బరువు తగ్గడం.
- తీవ్ర అలసటగా ఉండటం…ఇందులో కొన్ని కానీ, అన్ని లక్షణాలూ కానీ రోగిలో కనిపించవచ్చు.
చికిత్స
మూత్రాశయంలోని క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి నాలుగు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
1. సర్జరీ: మూత్రాశయంలో క్యాన్సర్ కణుతులను తొలగించడం. అవసరమైతే మూత్రాశయాన్ని, దానికి చేరువలో ఉన్న లింఫ్ నోడ్స్ను తొలగించాల్సి రావచ్చు.
2. కీమోథెరపీ: మూత్రాశయంలో క్యాన్సర్ కణుతుల పెరుగుదలను అడ్డుకునేందుకు కీమో థెరపీ చేస్తారు. ఆ ఔషధాలు రక్తం ద్వారా వెళ్లి కణుతుల పెరుగుదలను అడ్డుకుంటాయి.
3. రేడియేషన్: ఈ చికిత్సలో క్యాన్సర్ కణుతులను ధ్వంసం చేయడానికి ఎక్స్-రే లాంటి అతి శక్తివంతమైన కిరణాలను ఉపయోగిస్తారు.
4. ఇమ్యునోథెరపీ: ఇందులో భాగంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే ప్రయత్నం జరుగుతుంది. అలా క్యాన్సర్‌తో పోరాటం కొనసాగుతుంది. మూత్రాశయానికి మాత్రమే పరిమితమైన యూరి
థీలియల్ క్యాన్సర్‌కైనా, అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు పాకే మెటస్టాటిక్ యూరోథీలియల్ క్యాన్సర్‌కైనా ఇమ్యునోథెరపీని అత్యుత్తమ చికిత్సగా భావిస్తున్నది వైద్యరంగం.
రిస్క్ కారకాలు
లింగం, వయసు, తెగ, జన్యుపరమైన అంశాల మీద కూడా మూత్రాశయ క్యాన్సర్ ప్రమాదం
ఆధారపడి ఉంటుంది. అయితే, ధూమపానం మొట్టమొదటి ముప్పు అనే సంగతి మరచిపోవద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Bladder cancer
- Causes
- symptoms
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

