గచ్చకాయ-నలుపు రంగు కొమ్ములతో ఉండే నల్ల పసుపు లేదా కాలీ హల్దీ ఓ అరుదైన సుగంధ ద్రవ్యం. దీనిని ఈశాన్య, మధ్య భారతదేశంలో పండిస్తారు. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలకు ప్రసిద్ధిచెందిన నల్ల పసుపు కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, ఆస్తమా చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. మెదడు పనితీరును వృద్ధిచెందిస్తుంది. నల్ల పసుపు పేస్టును తేనె లేదా పాలతో కలిపి తీసుకుంటే జీర్ణకోశ, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గాయాలు, దురద, క్రిములు కుట్టినప్పుడు ఆయా ప్రదేశాల్లో నల్ల పసుపు పేస్టును, లేదా తైలాన్ని పైపూతగా వాడితే ఫలితం కనిపిస్తుంది. నుదుటి మీద మర్దనా చేస్తే పార్శ్వపునొప్పి మైగ్రెయిన్ నుంచి ఊరట దొరుకుతుంది.