Biryani chai : తేనీటి ప్రేమికులకు టైంతో పనిలేదు. ముఖ్యంగా వింటర్లో అయితే ఉదయం, సాయంత్రం, రాత్రి ఇలా ఏ సమయంలోనైనా వెచ్చగా టీని గొంతులో నింపుకోవాలని ఉబలాటపడుతుంటారు. ఇక ప్లెయిన్ టీ నుంచి మసాలా టీ, గ్రీన్ టీ, అల్లం టీ ఇలా ఒకటేమిటి ఎన్నో వెరైటీల టీని ఆస్వాదిస్తుంటారు.
ఇక ఎన్నో వెరైటీల ఛాయ్‌లను మనం ఎంజాయ్ చేస్తుంటే లేటెస్ట్గా బిర్యానీ ఛాయ్ టీ ప్రియులను అటెంప్ట్ చేయమంటూ టెంప్ట్ చేస్తోంది. బిర్యానీ టేస్ట్ ఈ ఛాయ్‌లో లేకున్నా ఈ డిష్‌లో బిర్యానీలో ఉండే వివిధ పదార్ధాలతో కూడిన లేయర్స్ ఇందులోనూ ఉండటంతో దీనికి బిర్యానీ ఛాయ్ అనే పేరు వచ్చింది. క్లాసిక్ మసాలా ఛాయ్‌లో ఉండే ఫ్లేవర్స్ బిర్యానీ ఛాయ్‌లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
తేయాకులతో పాటు ఇలాచీ, దాల్చినచెక్క, మిరియాలు సహా మసాలా దినుసులన్నీ నీళ్లలో బాయిల్ చేసి ఆపై అల్లం, తేనె, నిమ్మ రసం, పుదీనా ఆకులతో కూడిన గ్లాస్లో మిక్స్ చేయాలి. ఆపై వేడిగా, ఘుమఘుమలాడే బిర్యానీ ఛాయ్‌ను ఆస్వాదించవచ్చు.
Read More :