నల్లుప్పు.. కర్పూరమే!
వంటకాలకు రుచి, వాసన అందించే నల్లుప్పును అగ్నిపర్వత శిలల నుంచి వెలికితీస్తారు. హిమాలయ సానువుల్లో ఈ గనులు ఎక్కువ. ‘హిమాలయ బ్లాక్ సాల్ట్' ముదురు గులాబీ రంగులో ఉంటుంది.
భారతీయ వంటకాల్లో వాడే పదార్థం సైంధవ లవణం. ఇంగ్లిష్లో ‘బ్లాక్ సాల్ట్’గా పిలిచే ఈ నల్లుప్పు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతున్నది. కర్పూరంలానే అపార ఔషధ గుణాలను కలిగి ఉన్నదని నిర్ధారిస్తున్నది.
వంటకాలకు రుచి, వాసన అందించే నల్లుప్పును అగ్నిపర్వత శిలల నుంచి వెలికితీస్తారు. హిమాలయ సానువుల్లో ఈ గనులు ఎక్కువ. ‘హిమాలయ బ్లాక్ సాల్ట్’ ముదురు గులాబీ రంగులో ఉంటుంది. ఇతర రకాలు లేత గులాబీ నుంచి లేత వంగపండు వరకు వివిధ వర్ణాలలో లభిస్తాయి. ఇందులో ప్రాథమికంగా సోడియం క్లోరైడ్ ఉండగా.. సోడియం బైసల్ఫేట్, సోడియం సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ల ఉనికి కొంతవరకు ఉంటుంది.
అనేక రకాలు
హిమాలయ బ్లాక్ సాల్ట్
భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే నల్లుప్పు ఇదే. ఎన్నో ఖనిజాలు ఇందులో ఉంటాయి. రుచిగానూ ఉంటుంది. ఘాటైన వాసన వస్తుంది. కొంతమేర కోడిగుడ్డు వాసనను గుర్తుకు తెస్తుంది.
బ్లాక్ లావా సాల్ట్
దీన్నే హవాయియన్ బ్లాక్ సాల్ట్ అనీ పిలుస్తారు. నల్లగా ఉంటుంది. వంటకాలకు వైవిధ్యమైన మట్టి, పొగ వాసన అద్దుతుంది. దీన్ని హవాయిలోని అగ్నిపర్వతాల లావా నుంచి వెలికితీస్తారు.
బ్లాక్ రిచువల్ సాల్ట్
దీనికి ‘మంత్రగత్తె ఉప్పు’ అని కూడా పేరు. సముద్రపు ఉప్పు, చార్కోల్, బూడిదతో తయారవుతుంది. తినడానికి ఉపయోగించరు. దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుందని ఓ నమ్మకం.

వివిధ లాభాలు
- ఇందులో సోడియం తక్కువ. రక్తపోటు (బీపీ)ఉన్నవాళ్లకు మంచి ప్రత్యామ్నాయం.
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ లాంటి రుగ్మతలను తగ్గిస్తుంది.
- అనేక మినరల్స్ ఉంటాయి. చర్మం, వెంట్రుకల రంగు మెరుగు పడటంలో సహాయకారిగా ఉంటుంది. కేశాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. శరీరంలోని వ్యర్థాల నుంచి విముక్తి కల్పిస్తుంది.
- ఉప్పుతో ఊబకాయం ముప్పు ఎక్కువని అనేక అధ్యయనాల్లో తేలింది. అదే, నల్లుప్పులో అయితే సోడియం తక్కువగా ఉంటుంది. అలా ఊబకాయాన్ని వదిలించుకోవడంలోదోహదపడుతుంది.
- నల్లుప్పులోని పొటాషియం కండరాలు పట్టేయడాన్ని నివారిస్తుంది. కండరాల తిమ్మిర్లనూ (క్రాంప్స్) సమర్థంగా అడ్డుకుంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

