ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈకాలం పిల్లలు లొట్టలేసుకుని మరీ తింటారు. తినడానికి చాలా టేస్టీగా ఉన్నప్పటికీ ఈ జంక్‌ఫుడ్‌తో ఆరోగ్యానికి చాలా ముప్పు ఉంటుంది. ఇవి లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి.

ఫ్రెంచ్‌ఫ్రైస్ ఆలుగడ్డలతోనే తయారు చేస్తారు. కానీ ఇవి నిత్యం తినడం ద్వారా అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిని ఆయిల్‌లో వేసి ఎక్కువసేపు ఉడకబెడతారు కాబట్టి ఇవి రుచికరంగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి.

వీటిని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు. దీంతో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. ప్రతి రోజు అల్పాహారంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఫ్రెంచ్ ఫ్రైస్‌లో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం ద్వారా మనకు తెలియకుండానే శరీరంలో ఉప్పు శాతం పెరుగుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. ఇది భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
RELATED GALLERY
-
Nipah Virus | ప్రాణాంతక నిపా వైరస్ ఒకరికి నుంచి ఇంకొకరికి సోకుతుందా..? ముప్పు ఎవరికి ఎక్కువ..?
-
Ganesh Chaturthi Fast | ఉపవాస వేళ ఇలా చేస్తే ఆరోగ్యకరం..!
-
Cashew | రోజూ జీడిపప్పు తినడం మంచిదేనా?
-
Benefits of Raw Coconut | తరచూ పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా..?
-
Plant Based Diet | మొక్కల ఆధారిత డైట్‌ను ఇలా సెట్ చేసుకోండి..!
-
Heart Attack | గుండెపోటుతో ఆరో తరగతి విద్యార్థి కన్నుమూత..! కారణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిపుణులు..!