Diabetes | డయాబెటిస్ ఉన్నవాళ్లు మక్కలు తినొచ్చా?
Diabetes | ఈ సీజన్లో మక్కలు ఎక్కువగా దొరుకుతాయి. కానీ, వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చా. అలాగే కార్న్ఫ్రైడ్ రైస్, కార్న్ సమోసా, క్రిస్పీ కార్న్ అంటూ రకరకాల వంటలు చేస్తుంటారు. ఇవి ఎంతవరకూ ఆరోగ్యకరం?
Diabetes | ఈ సీజన్లో మక్కలు ఎక్కువగా దొరుకుతాయి. కానీ, వీటిలో చక్కెరలు అధికంగా ఉంటాయని అంటారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చా. అలాగే కార్న్ఫ్రైడ్ రైస్, కార్న్ సమోసా, క్రిస్పీ కార్న్ అంటూ రకరకాల వంటలు చేస్తుంటారు. ఇవి ఎంతవరకూ ఆరోగ్యకరం?
– ఓ పాఠకురాలు
మొక్కజొన్న శక్తికి చిరునామా. తక్షణ శక్తికి మంచి ఎంపిక. ఇందులో విటమిన్- ఎ, బి, ఇ, కె లాంటి విటమిన్లతోపాటు.. మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్‌లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. తక్కువ స్థాయిలో కొవ్వులూ ఉంటాయి. అందువల్ల ఎవరైనా తినొచ్చు. కాకపోతే, ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువే. అందుకే మధుమేహులు దూరంగా ఉండాలంటారు. అలా అని, అసలు తినకూడదని కాదు, తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దానికి తగ్గట్టు మిగతా ఆహారాన్ని సమతులం చేసుకోవాలి. కాల్చిన వాటికంటే ఉడికించినవే మేలు. వారానికి ఒక కంకి వరకూ తినొచ్చు. ఇక, ఇందులో పీచులు ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తికి మంచిది. తినగానే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది.
సాయంత్రం స్నాక్గానో, సలాడ్లోనో తీసుకుంటే మంచిది. అందులోనూ ఉడికించినవి కాస్త తక్కువ మోతాదు తీసుకున్నా కడుపు నిండుతుంది. మొక్కజొన్న గింజలతో కార్న్ఫ్రైడ్ రైస్, కార్న్ సమోసా, క్రిస్పీ కార్న్ అంటూ రకరరకాల వంటలు చేస్తున్నారు. వీటిలో గింజల్ని వేయిస్తారు. దీనివల్ల పోషకాలు పోతాయి. రుచికి తినడమే తప్ప ఆరోగ్యపరంగా ఏమంత లాభం ఉండదు. దానికి బదులు, గింజల్ని అన్నంతో పాటు ఉడికించి చేసే కార్న్ పలావ్ లాంటివే మేలు. అందులోనూ ఇది మక్క గారెల సీజన్ కాబట్టి ఒకటి రెండు సార్లు తింటే ఫర్వాలేదు. అయితే, ఇందులో నూనె అధికంగా ఉంటుంది. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు మోతాదు మీద దృష్టి ఉంచితే మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

