చిరుధాన్యాలు రోజూ తినొచ్చా?
అన్నం పూర్తిగా మానేసి మిల్లెట్ (చిరుధాన్యాలు) డైట్ పాటించడం మంచిదేనా. చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన వరి అన్నాన్ని నెలల తరబడి వదిలిపెట్టడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా! మిల్లెట్ డైట్ తీసుకొనే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అన్నం పూర్తిగా మానేసి మిల్లెట్ (చిరుధాన్యాలు) డైట్ పాటించడం మంచిదేనా. చిన్నప్పటి నుంచి మనకు అలవాటైన వరి అన్నాన్ని నెలల తరబడి వదిలిపెట్టడం వల్ల ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందా! మిల్లెట్ డైట్ తీసుకొనే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఓ పాఠకురాలు
మనం పుట్టినప్పటి నుంచి వరి అన్నం తింటున్నాం. అలాంటిది షుగర్ అదుపులోకి రావాలనో, బరువు త్వరగా తగ్గాలనో ఉన్నట్టుండి దాన్ని పూర్తిగా మానేసి చిరుధాన్యాల మీద ఆధారపడటం మంచిది కాదు. ఇందులో ఉండే హై ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మీద ఒక్కసారిగా భారం పెరిగిపోతుంది. అందులోనూ ఈ ఆహారం కొందరికి పడొచ్చు. కొందరికి పడకపోవచ్చు. కాబట్టి మూడు పూటలా మిల్లెట్డైట్కి వెంటనే మారిపోకూడదు. నెమ్మదిగా దీన్ని అలవాటు చేసుకోవడం ముఖ్యం. ముందు ఒకసారి తీసుకునే ఆహారంలో దీన్ని చేర్చుకోవాలి. ఉదాహరణకు బ్రేక్‌ఫాస్ట్… మిల్లెట్ ఇడ్లీ, దోశ, ఉప్మాలాంటివి వారంలో రెండు మూడుసార్లు తీసుకోవడం మొదలుపెట్టి కొద్ది రోజుల తర్వాత రోజూ తీసుకోవచ్చు. అందులోనూ దోశల్లాంటి వాటికి సగం బియ్యం సగం మిల్లెట్లు… ఇలా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం రోజూ తినేవాటితో వీటిని కలిపి తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం విషయానికి వస్తే.. రాగి ముద్ద, బియ్యంలో కొర్రలు లేదా ఇతర మిల్లెట్లు కలిపి అన్నంలా వండుకోవచ్చు. ఇలా అలవాటు చేసుకున్నాక, మొత్తంగా చిరుధాన్యాలు తినొచ్చు. అది కూడా మొదట్లో రోజు విడిచి రోజు తినాలి.
ఇలా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అలవాటయ్యాక, రాత్రి కూడా మిల్లెట్లు తినడానికి ప్రయత్నించొచ్చు. చపాతీల్లాంటివి తినేవారు గోధుమ పిండి, మిల్లెట్ పిండి కలిపి చేసుకోవచ్చు. అలాగే మల్టీగ్రెయిన్ ఆటా… అంటే రాగులు, కొర్రలు, జొన్నలు అన్నీ కలిపి పట్టించుకున్నవి తినొచ్చు. ఇలా అలవాటు అయ్యాక… మన ఇష్టాన్ని బట్టి ఏవో ఒక రెండు మిల్లెట్లు రెగ్యులర్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇలా నెమ్మదిగా మూడు పూటలా మిల్లెట్ డైట్ అలవాటు చేసుకోవచ్చు. అందులోనూ ఒక్కో రోజు ఒక్కో రకం చొప్పున… కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు… అన్ని రకాలూ తినగలిగితే మంచిది. వారంలో నాలుగు లేదా అయిదు రోజులు ఈ మిల్లెట్ డైట్ పాటిస్తున్నా సరే, మిగతా రెండు మూడు రోజులు చక్కగా మామూలు భోజనం చేయొచ్చు. అయితే చిరుధాన్యాలు సరిగ్గా ఉడకకపోతే అజీర్తి చేయడం, కడుపునొప్పి రావడంలాంటివి జరగొచ్చు. అందుకే రాత్రంతా నానబెట్టి వండుకోవాలి. లేదా పిండిపట్టుకోవాలి. వీటిలో ఉండే గాయిట్రోజెన్లు అయోడిన్ శోషణను ఇబ్బంది పెడతాయి. అందుకే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు తప్పకుండా పోషకాహార నిపుణుల సలహా మీదే ఈ డైట్ పాటించాలి.
– మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్, Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

