Nose | ముక్కు ఆకృతి బాగోలేదని అబ్బాయిలు వెక్కిరిస్తుంటారు.. సలహా ఇవ్వండి
Nose | క్లియోపాత్రా ముక్కు మరోలా ఉంటే.. చాలా యుద్ధాలు జరిగేవే కాదు అంటారు చరిత్రకారులు. నాసికతో మొహానికి కొత్త అందం వస్తుంది. కొందరికి పుట్టుకతో ముక్కు అసహజమైన ఆకృతిలో ఉంటుంది. ప్రమాదాల కారణంగానూ రూపం మారిపోవచ్చు. ముక్కు మీద బొడిపెల్లాంటివి మరింత ఇబ్బంది పెడతాయి.
Nose | నా వయసు ఇరవై. ఎత్తుకు తగిన బరువుతో, తీరైన ఆకృతితో ఆకట్టుకునేలా ఉంటాను. కానీ, నా ముక్కు కోసుకుపోయినట్టు ఉంటుంది. దీంతో అబ్బాయిలు వెక్కిరిస్తుంటారు. ఫలితంగా నా ఆత్మవిశ్వాసం దెబ్బతింటున్నది. సరైన సలహా ఇవ్వగలరు.
ఓ పాఠకురాలు

క్లియోపాత్రా ముక్కు మరోలా ఉంటే.. చాలా యుద్ధాలు జరిగేవే కాదు అంటారు చరిత్రకారులు. నాసికతో మొహానికి కొత్త అందం వస్తుంది. కొందరికి పుట్టుకతో ముక్కు అసహజమైన ఆకృతిలో ఉంటుంది. ప్రమాదాల కారణంగానూ రూపం మారిపోవచ్చు. ముక్కు మీద బొడిపెల్లాంటివి మరింత ఇబ్బంది పెడతాయి. నాసికా రంధ్రాలు మరీ పెద్దగా ఉన్నా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. వీటివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అటుంచితే.. ప్రధానంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. డిప్రెషన్లోకి వెళ్లి పోతారు.
ఆత్మహత్య ఆలోచనలు వేధిస్తాయి. ఆధునిక వైద్య విజ్ఞానం ఇలాంటి లోపాల్ని సరిచేసుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చింది. హైలురోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ సాయంతో కొన్ని లోపాలను సరిచేస్తారు. నిర్దిష్ట ప్రదేశంలో కొవ్వు పేరుకుపోయి ఉంటే.. దాన్ని పూర్తిగా తొలగించడమో, మరో ప్రాంతానికి తరలించడమో చేయవచ్చు. ముక్కు కొనభాగాన్ని తీర్చిదిద్దడానికి త్రెడ్ లిఫ్ట్ పద్ధతిని ఆశ్రయిస్తారు. ముక్కు పుటాల లోపాలను సరిచేయడంలో బొటాక్స్ సాంకేతికత సాయపడుతుంది. నాన్ సర్జికల్ రైనోప్లాస్టీ ద్వారా నాసిక ఆకృతిని సరిచేయవచ్చు. కానీ ఇది బాహ్య రూపానికే పరిమితం. ముక్కు పనితీరును సరిదిద్దలేదు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా.. నిపుణులను సంప్రదించి పరిష్కరించుకోవడం ఉత్తమం.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేసియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

