లండన్ : ఆహారంలో నిత్యం బీన్స్ తీసుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంగా ఉండే ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఎక్కవుగా బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటారని వెల్లడైంది. ప్రపంచంలోనే వంద ఏండ్లకు పైబడి జీవించే ఆరోగ్యకరమైన ప్రజలున్న ప్రాంతాలుగా పిలిచే బ్లూజోన్ డైట్లో బీన్స్‌కు ప్రత్యేక స్దానం ఉంది.
బీన్స్ వాడకంతో శరీరానికి పుష్కలంగా ప్రొటీన్ లభించడంతో పాటు శరీరంలో వాపును నివారించడంతో పాటు స్ధూలకాయం ముప్పు తగ్గడం, వ్యాధులకు లోనయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతారు. బ్లూజోన్ డైట్లో ఇతర ప్రాంతాల వారూ తీసుకునే ఆహారంలో ముందువరసలో చిక్కడు, బీన్స్ నిలుస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొలేట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఈ ఆహారం అధిక బరువు, గుండెజబ్బులు, వాపు వంటి వ్యాధులను నివారిస్తుందని న్యూట్రియంట్స్లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. పండ్లు, కూరగాయలతో పాటు బీన్స్‌ను ఆహారంలో తరచూ తీసుకుంటే గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహంతో దీటుగా పోరాడవచ్చని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ నివేదిక పేర్కొంది.