పోషకాలతో.. పొడవాటి కురులు
మన ఆరోగ్యాన్ని జుట్టు పట్టిచూపుతుంది. రంగు మారితే ఒక సమస్య,మందం తగ్గితే ఒక రుగ్మత, ఊడితే ఒక ఉపద్రవం. ఇక, బట్టతల వస్తే బ్రహ్మాండం బద్దలైనంత పెద్ద గండమే. కాబట్టి మీ కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోండి.
మన ఆరోగ్యాన్ని జుట్టు పట్టిచూపుతుంది. రంగు మారితే ఒక సమస్య,మందం తగ్గితే ఒక రుగ్మత, ఊడితే ఒక ఉపద్రవం. ఇక, బట్టతల వస్తే బ్రహ్మాండం బద్దలైనంత పెద్ద గండమే. కాబట్టి మీ కేశాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. రోగాలను ఆమడదూరంలో ఉంచండి.
జుట్టు కాంతిహీనంగా, పెళుసుగా ఉంటే, మందం తగ్గినట్టు అనిపిస్తుంటే పోషక విలువల లోపం ఉన్నట్టు. వెంట్రుకలు రాలిపోవడాన్ని పౌష్టికాహారం అరికడుతుంది. కాబట్టి, సరైన మోతాదులో ప్రొటీన్లు తీసుకోవాలి.
విపరీతమైన డైటింగ్ వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు లోపించడం, బాగా రిఫైన్ చేసిన కార్బొహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకోవడం కూడా ఇందుకు కారణమే. స్థూల, సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారంతో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.
వెంట్రుకల ఆరోగ్యానికి అత్యావశ్యకమైన పోషకాలలో విటమిన్-ఎ ఒకటి. గుమ్మడి గింజలు, పాలకూర, పాలు, పెరుగు.. విటమిన్-ఎ నిధులు. ఇక విటమిన్-సి శరీరం ఐరన్‌ను శోషింపజేసుకోవడంలో తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన కురుల తయారీకి సహకరిస్తుంది. ఉసిరి, నిమ్మ, బెల్ పెప్పర్స్, జామ, స్ట్రాబెర్రీ.. విటమిన్-సి వనరులు.
బయోటిన్గా పిలిచే విటమిన్-బి 7 కుదుళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. కెరాటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు విపరీతంగా రాలిపోయే రుగ్మత.. అలోపీసియా చికిత్సలో బయోటిన్‌ను ఉపయోగిస్తారు. ఇది బట్టతలను నివారించడంలోనూ సహాయకారిగా ఉంటుంది. బాదం, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, గుడ్లు, గోధుమ పొట్టు బయోటిన్ గనులు.
శరీరంలో ఐరన్ స్థాయులు తగ్గిపోవడం కూడా బట్టతలకు దారితీస్తుందని అధ్యయనాల్లో తేలింది. వేయించిన శనగలు, మెంతి చిక్కి లేదా లడ్డు, బఠాణీలు, రాజ్మా, జీడిపప్పు శరీరంలో ఐరన్ లోపానికి మంచి మందులు.
వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడానికి, దృఢంగా ఉండటానికి అత్యవసరమైన ఖనిజాల్లో జింక్ ముఖ్యమైంది. పప్పులు, గుమ్మడిగింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అయితే, జింక్ ఎక్కువైతే ప్రయోజనాలు తిరగబెడతాయి. అందువల్ల పోషక లోపాలు తలెత్తిన సందర్భాల్లో సప్లిమెంట్లను తగిన మోతాదులోనే తీసుకోవాలి.
చివరగా, వెంట్రుకలు రాలిపోవడాన్ని నివారించాలంటే ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు ఉండాలి. రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, గుడ్లు, చిక్కుళ్లు, చికెన్, ఫిష్, పనీర్.. వీటిలో కనీసం మూడు పదార్థాలు ఉంటేనే శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అందుతాయి. కురుల పెరుగుదలకు ముడిపదార్థాలూ దొరుకుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

