గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 04, 2020 , 22:26:28

భయం వద్దు, వ్యాప్తిని ఆపుదాం..

భయం వద్దు, వ్యాప్తిని ఆపుదాం..

మనుషులు ముప్పును ఎదుర్కొన్నప్పుడు, మొదట శరీరం విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. తర్వాత అది ‘పోరాడటమా?’ లేదా ‘పారిపోవడమా?” అనేది నిర్ణయించుకుంటుంది. ఈలోపు కలిగే ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇక్కడ అతిపెద్ద ముప్పు భయమే. అందుకే భయం కలిగించే విషయాలు, ఆందోళన కలిగించే అంశాలను వ్యాప్తి చేయకూడదు. ఇలాంటి భయాందోళనల పాఠాలు ఫార్వర్డ్‌ చేయడంలో అర్థం లేదు. మీరు భయపడకండి. మీ శరీరాన్ని అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దు. మీ రోగనిరోధక శక్తిని నమ్మండి. అదే మిమ్మల్ని ఇలాంటి ఎన్నో వైరస్‌ల నుంచి రక్షిస్తుంది. గతంలో రక్షించింది కూడా. 


ఇలా చేయండి..

1. బయటి నుంచి వచ్చాక తప్పక చేతులు కడుక్కోవాలి. సానిటైజర్లు వాడాలి.  

2. మీ ముక్కు, నోరును చేతులతో తాకవద్దు.

3. జ్వరంతో ఉన్నవారికి దూరంగా ఉండండి. రెండు మూడు వారాల కింద దేశవిదేశాల నుంచి వచ్చి దగ్గు, ఊపిరి ఆడని స్థితిలో ఉన్న వారికి దూరంగా ఉండండి. 

4. జలుబు, జ్వరాలన్నీ కరోనా వైరస్‌కు సంబంధించినవి కావు. వాటిల్లో ఎక్కువ భాగం సాధారణ ఫ్లూలే కావచ్చు. సరైన మందులు వాడండి. విశ్రాంతి తీసుకోండి.  

5. దగ్గు, తుమ్ము వస్తే మీ అర చేతులు అడ్డు పెట్టకండి. టిష్యూ పేపర్‌ లేదా కర్చీఫ్‌ వాడడం మంచిది.  

6. నీరు తగినంత తాగండి. ఏ ఆహారమూ ఒక్కరోజులో మీ రోగనిరోధక శక్తిని పెంచదు. కానీ సిట్రస్‌ జాతి పండ్లు, వెల్లుల్లి తప్పక తీసుకోవాలి.  

అనారోగ్యంతో ఉన్న వారిని, శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లండి. వారు సురక్షితంగా ఉండేందుకు సహాయం చేయండి. నమ్మండి. వ్యాప్తిని ఆపండి. 


డాక్టర్‌ వెంకట్‌ రామన్‌ కోల,

సీనియర్‌ ఇంటెన్సివిస్ట్‌ &

క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ 

యశోద హాస్పిటల్స్‌, సికింద్రాబాద్‌


logo
>>>>>>