రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా

ఎండకాలం అంటే గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండకాలంలో వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉండటం వల్ల ఎండ వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో వాటర్ లెవల్స్‌తో పాటు షుగర్ లెవల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు దోహదపడతాయి. మిగిలిన 8 శాతంలోనూ విటమిన్ ఏ, బీ1, బీ6, స2, పొటాషియం, మెగ్నీషియం, బయోటిన్, కాపర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
పుచ్చకాయ తింటే కలిగే ప్రయోజనాలు
– పుచ్చకాయ రోజూ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
– కొన్ని రకాల కేన్సర్ వ్యాధులను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.
– పుచ్చకాయలో ఉండే విటమిన్ సీ.. జుట్టును అందంగా, బలంగా మారుస్తుంది.
– కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ.. కళ్ల రెటీనాలో పింగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే వేసవిలో కంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
– కడుపుతో ఉన్న మహిళలు పుచ్చకాయ తినడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.
– కాల్షియం అధికంగా ఉండే పుచ్చకాయ తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాతం వంటి రోగాలు నయమవుతాయి.
– కిడ్నీలో రాళ్లు ఉన్నవారు.. మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుందట.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Food
- Health food
- Summer
- watermelon
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

