Khilla Ghanapuram Fort | పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఖిల్లా ఘనపురం కోట
మహబూబ్నగర్ జిల్లాలోని ఖిల్లా ఘనపురం సమీపంలో ఉన్నందుకు ఈ కోటకు ఖిల్లా ఘనపురం కోట అనే పేరొచ్చింది. ఇది కాకతీయుల కాలం నాటి కోట. గణపతి ప్రభువుపై భక్తితో రేచర్ల పద్మనాయకులు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది.
మహబూబ్నగర్ జిల్లాలోని ఖిల్లా ఘనపురం సమీపంలో ఉన్నందుకు ఈ కోటకు ఖిల్లా ఘనపురం కోట అనే పేరొచ్చింది. ఇది కాకతీయుల కాలం నాటి కోట. గణపతి ప్రభువుపై భక్తితో రేచర్ల పద్మనాయకులు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతున్నది. యుద్ధ వ్యూహాలకు అనువుగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఆంజనేయుని గుడి, గచ్చుబావి, ఏనుగుల గుండం, నేతిగుండం, పాలగుండం వంటి కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేతిగుండం, పాలగుండంలో ఇప్పటికి స్వచ్ఛమైన నీరు లభించడం విశేషం. ఖిల్లా ఘణపురం కోట పత్యేకత చీకటి గది. ఈ మధ్య కాలంలో ఈటకు పర్యాటకుల సందడి పెరిగింది. ఖిల్లా ఘణపురం కోట ఫొటోలు మీకోసం…
ఫొటోలు : బందిగె గోపి, నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్