Gadwal
- Jan 06, 2021 , 01:11:21
VIDEOS
జములమ్మ హుండీ ఆదాయం రూ.9,23,631

గద్వాల రూరల్, జనవరి 5: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆల యం హుండీ లెక్కింపు మంగళవారం ఆలయ అధికారులు భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ, ఆలయ ఈవో వీరేశం, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరాములు సమక్షంలో భక్తుల సహకారంతో హుండీ లెక్కించారు. ఆగస్టు 15 నుంచి జనవరి 5 వరకు రూ.9,23,631 ఆదాయం వచ్చినట్లు ఈవో వీరేశం తెలిపారు. గతేడాది మార్చి నుంచి ఆగస్టు15 వరకు రూ.5.54లక్షల ఆదాయం రాగా మొత్తం రూ.14.77లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది మురళీధర్‌రెడ్డి, సంజీవరెడ్డి, రవిప్రకాశ్, సురేశ్, మద్దిలేటి, నాగరాజు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING