ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నేడే సహకార పోలింగ్‌

నేడే సహకార పోలింగ్‌

Feb 15, 2020 , 02:02:23
PRINT
నేడే సహకార పోలింగ్‌

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సింగిల్‌ విండో పో లింగ్‌కు సంబంధించి ఎన్నిలక అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. జిల్లాలోని అ న్ని సహకార సం ఘాల పరిధిలో పో లింగ్‌ కేంద్రాలను ఏ ర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. మొత్తం 103వార్డుల్లో విధులు నిర్వహించేందుకు పీవోలను, ఏపీవోలను నియమించి వారందరికీ ఎన్నికల సామగ్రి ని పంపిణీ చేశారు. పోలింగ్‌ అనంతరం కౌంటింగ్‌ నిర్వహించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించ నున్నారు. ఇందుకోసం ఎన్నికల అధికారులు పక్కాగా ఏర్పాట్లను చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ భద్రతలను ఏర్పాటు చేసింది. 

ఉదయం 7గంటల నుంచి పోలింగ్‌

ఈ రోజు ఉదయం 7గంటల నుంచి మ ధ్యాహ్నం 2 వరకు ఎన్నికల అధికారులు సహకార సం ఘాల పోలింగ్‌ను నిర్వహించనున్నారు. జిల్లా లో మొత్తం 11సింగిల్‌ విండో ల పరిధిలో 103 స్థానాలకు పో లింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందుకుగా ను జిల్లావ్యాప్తంగా మొ త్తం 261 మంది అ భ్యర్థులు బరిలో నిలిచారు. 11 పోలింగ్‌ కేం ద్రాలను ఏర్పాటు చేసి ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 13 పో లింగ్‌ రూంలను కూడా ఏర్పాటు చేశారు. పో లిం గ్‌ నిర్వహణ అనంతరం ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టి సాయంత్రానికి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. 

విధుల్లో 450 మంది సిబ్బంది

సహకార సంఘం ఎన్నికలను విజయవంతగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు మొత్తం జిల్లాలో 450 మంది పో లింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో 103 వార్డులకు 103 మంది పీవోలను వీరికి అదనంగా 338 మంది ఏపీవోలను, 9 మంది నోడల్‌ ఆఫీసర్లను నియమించారు. పోలింగ్‌ సిబ్బందికి శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డ్‌లో ఎన్నికల అధికారులు పోలింగ్‌ సామగ్రిని అం దించారు. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌ల ద్వారా నిర్వహించడంతో పోలింగ్‌ సిబ్బందికి బ్యాలెట్‌ బాక్స్‌లను, బ్యాలెట్‌ పేపర్లను, స్వస్థిక్‌ మార్క్‌ స్టాంప్‌లను, ఇంక్‌ప్యాడ్‌లను అందించారు. పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు 4 రూట్లను ఏర్పాటుచేసి రూట్‌ ఆఫీసర్లను, జోనల్‌ ఆఫీసర్లను నియమించి బాధ్యతలు అప్పగించారు.   

పోలింగ్‌ కేంద్రాల్లో సకల సదుపాయాలు

సహకార సంఘంలో ఓటుహక్కును కలి గి ఉన్న ప్రతి రైతుల ఓటు వినియోగించుకునేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు  కలుగుకుండా జిల్లా వ్యాప్తం గా అన్ని పోలింగ్‌ కేంద్రాల దగ్గర వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగించుకొనే వికలాంగులను, వృద్ధులను ప్రభుత్వమే ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకు వచ్చే సదుపాయం క ల్పించారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఏర్పా టు చేయబడిన  వలంటీర్లు వృద్ధులు, వికలాంగులను వీల్‌చైర్ల ద్వారా పోలింగ్‌ కేం ద్రంలోకి తీసుకువెళ్లి ఓటు హక్కు వినియోగించు కునేందుకు సహాయపడుతారు.  పో లింగ్‌ కేంద్రాల దగ్గర మంచి నీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.  పోలింగ్‌ సజావుగా సాగేందుకు నిఘా నడుమన కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 


logo