శనివారం 04 ఏప్రిల్ 2020
Gadwal - Feb 02, 2020 , 23:52:08

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం

వడ్డేపల్లి : మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించడానికి అందరూ కలిసికట్టుగా కృషిచేదామని మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ కరుణ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఆదివారం పూజ నిర్వహించి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. మున్సిపాలిటీలో గతంలో చేపట్టిన పనులు, చేపట్టాల్సిన పనులు, నిధులు తదితర అంశాలను మున్సిపాలిటీ కమిషనర్‌ పార్థసారధి, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావులు వారికి వివరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ను, వైస్‌ చైర్‌పర్సన్‌ను, కౌన్సిలర్లను ప్రజలు ఘనంగా సన్మా నించారు.  


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు బసవపున్నయ్య, మాజీ ఎంపీపీ కొంకల నాగేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్రామన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ కరుణ మాట్లాడుతూ నా బాధ్యతను గుర్తు ఉంచుకొని సేవలందిస్తామని, నాపై ఉం చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అన్ని వేళల్లో ప్రజాసేవలోనే ఉంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ బి.సుజాత, కౌన్సిలర్లు మాణిక్యం రవి, లలితమ్మ, దేవమ్మ, ధనలక్ష్మి, ఆంజనేయులు, సుజాత, కోఆప్షన్‌ సభ్యులు నాయకులు వడ్డేపల్లి సూరి, రామకృష్ణా రెడ్డి, గడ్డం శ్రీను, బాబీ, మహిపాల్‌ రెడ్డి, నాగశిరోమణిలు  తదితరులు పాల్గొన్నారు.


logo