బుధవారం 01 ఏప్రిల్ 2020
Gadwal - Feb 01, 2020 , 00:47:48

పుష్పరథంపై జోగుళాంబ

పుష్పరథంపై జోగుళాంబ

అలంపూర్‌, నమస్తే తెలంగాణ : జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో శుక్రవారం అమ్మవారి రథోత్సవం భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అంతకుముందు యాగశాలలో నిర్వహించిన చండీహోమంలో భక్తులు  పాల్గొన్నారు. అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం ఆలయంలో అర్చకులు వారోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి త్రిశతి, ఖడ్గమాల, కుంకుమార్చనలు తదితర పూజలు నిర్వహించారు. ఆలయంలో శుక్రవారం  సాయంత్రం  జోగుళాంబ ఆలయంలో పూలరథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం శోభాయమానంగా గర్భాలయం చుట్టు రథాన్ని ఊరేగించారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


logo
>>>>>>