మంగళవారం 31 మార్చి 2020
Gadwal - Jan 31, 2020 , 01:54:26

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

ఉత్సాహంగా బండలాగుడు పోటీలు

అయిజ : మండలంలోని ఉత్తనూరు ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ని ర్వహిస్తున్న పశుబల ప్రదర్శన పోటీలు ఉత్సాహం గా కొనసాగుతున్నాయి. ఈ పోటీలను స్థానిక ప్ర జాప్రతినిధులు గురువారం ప్రారంభించారు. తె లంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ర్టాల నుంచి తరలివచ్చిన వృషభరాజములు బల ప్రదర్శనలో పాల్గొనగా పోటీలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు, యువకులు అధిక సంఖ్యలో తరలివచ్చా రు. ప్రతి ఏటా మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి ఆధ్వర్యంలో పశుబల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గ్రా మంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న అఖిల భారత ఒంగోలు గోజాతి పోష క, ప్రోత్సాహక సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆరు పళ్ల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ఈ పోటీల్లో 16 జతల వృషరాజములు పాల్గొన్నాయి.  శుక్రవారం న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహించనున్నట్లు దేవస్థా న కమిటీ తెలిపింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వృషభాలు ఇప్పటికే తరలివచ్చాయి. logo
>>>>>>