బుధవారం 08 ఏప్రిల్ 2020
Gadwal - Jan 28, 2020 ,

నేడే పట్టాభిషేకం

నేడే పట్టాభిషేకం
  • కొలువుదీరనున్న మున్సిపల్‌ చైర్మన్లు
  • మున్సిపాలిటీలో ఎన్నిక కార్యక్రమం
  • ఉదయం 11గంటలకు అధికారిక ప్రకటన
  • ప్రక్రియ చేపట్టనున్న ప్రత్యేక అధికారులు

జోగుళాంబ గద్వాలజిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ :మున్సిపల్‌ ఎన్నికల చివరి చివరి అంకం నేటితో ముగియనుంది. నాలుగు మున్సిపాలిటీల్లో మెజారిటీ సీట్లను సాధించి పార్టీ నుంచి కౌన్సిలర్లు చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఉదయం 11గంటలకు 4 మున్సిపల్‌ కార్యాలయాల్లో చైర్మ న్‌ ఎన్నిక ప్రత్యేక అధికారులు చేపట్టనున్నారు. గద్వాల, అలంపూర్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండగా, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ అధిక స్థానాలను సాధించింది. హంగ్‌  ఏర్పడిన అయిజలో టీఆర్‌ఎస్‌ పార్టీయే చైర్మన్‌ పదవిని దక్కించుకునే అవకాశాలున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో చైర్మన్ల ఎన్నిక అధికారులు నేడు నిర్వహించనున్నారు. రాజ్యంగ బధ్ధంగా జిల్లాలోని గద్వాల, అ యిజ, అలంపూర్‌, వడ్డేపల్లిలో మున్సిపల్‌ చైర్మన్లు కొలువుదీరనున్నారు. వచ్చే 5ఏళ్లపాటు పురపాలికల్లో ఎన్నికోనున్న చైర్మన్లు పరిపాలన కొనసాగించనున్నారు. ఎన్నికల సం ఘం ముందస్తుగా ప్రకటించిన షె డ్యూల్‌ ప్రకా రం చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. 4 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేపట్టారు. మున్సిపల్‌ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పా టు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఆందోళన జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నారు. 

ఉదయం 11గంటలకు ఎన్నిక

ఎన్నికల అధికారులు ప్రకటించి షెడ్యూల్‌ ప్ర కారం సోమవారం ఉదయం 11గంటలకు ము న్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అన్ని పార్టీల తరుపున ఎన్నికైన కౌన్సిలర్లకు ఎన్నికల అధికారులు ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. ఈ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో మెంబర్లులుగా మున్సిపల్‌ ఎన్నికల చైర్మన్ల ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఎన్నికల కోసం గద్వాల మున్సిపాలిటీలో డీఆర్‌డీవో నరసింహ, అయిజ మున్సిపాలిటీలో ఆర్డీవో రాములు, వడ్డేపల్లి ము న్సిపాలిటీలో మైనింగ్‌ అధికారి విజయరామారా వు, అలంపూర్‌ మున్సిపాలిటీలో వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌ నాయక్‌లు ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహించనున్నారు. చైర్మన్‌ ఎన్నికకు హాజరైన పార్టీల కౌన్సిలర్లు చైర్మన్‌గా ఎవరిని ప్రతిపాదిస్తున్నారన్న అంశాన్ని తెలుసుకుంటారు. సభ్యులు ప్రతిపాదించిన కౌన్సిలర్‌ అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నుకునేందుకు ఓటు వేసిన సభ్యుల సం ఖ్యను అధికారులు నమోదుచేసుకుంటారు. అనంతరం మెజారిటీ కౌన్సిలర్ల ఓటింగ్‌ను సొంతం చే సుకున్న అభ్యర్థిని చైర్మన్‌గా ఎన్నికల అధికారు లు ప్రకటించనున్నారు. అనంతరం చైర్మన్‌ అభ్యర్థితో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  

గద్వాల, అలంపూర్‌లో టీఆర్‌ఎస్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో గద్వాల, అలంపూర్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. గద్వాలో 37 వార్డుల్లో  టీఆర్‌ఎస్‌ పార్టీకి 19, బీజేపీ 10, కాంగ్రెస్‌ 3, ఎంఐఎం 1, ఇండిపెండెంట్లు 4 సీట్లను గద్వాల పట్టణ ప్రజలు కట్టబెట్టారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థులు దాదాపుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి సపోర్ట్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అధిక మెజారిటీతో టీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అలంపూర్‌లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. అలంపూర్‌లో 10 వార్డుల్లో 5వ వార్డ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున ఏకగ్రీవం కాగా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 6, కాంగ్రెస్‌ 2, ఫార్వర్డ్‌ బాక్‌ ఒక సీటును సాధించారు. ఇం దులో 7 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిక్యం సా ధించడంతో అలంపూర్‌ చైర్మన్‌ పదవి టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వెళ్లింది. 

వడ్డేపల్లి కాంగ్రెస్‌, అయిజ టీఆర్‌ఎస్‌

వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాల్లో కాంగ్రెస్‌కు 8 సీట్లు, టీఆర్‌ఎస్‌ 2 సీట్లు సాధించారు. దీంతో సంపూర్ణ మెజారిటీ ఉండటంతో కాంగ్రెస్‌ పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. ఇక అయిజ మున్సిపాలిటీలో మొత్తం 20వార్డులకు గాను 10 స్థానాలు ఫార్వర్డ్‌ బాక్‌, 6 టీఆర్‌ఎస్‌, 4 కాంగ్రెస్‌ పార్టీలు స్థానాలను సా ధించాయి. దీంతో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం అయిజ మున్సిపాలిటీ హంగ్‌ ఏర్పడింది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల పలు సంప్రదింపులతో  అయిజ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి సొంతమయ్యే అవకాశాలున్నాయి.   logo