ఆదివారం 29 మార్చి 2020
Gadwal - Jan 18, 2020 , 01:08:03

పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
  • - ఓటర్లను గుర్తించడంలో ప్రిసైడింగ్‌ అధికారులు జాగ్రత్తగా వ్యవహించాలి
  • - పోలింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
  • -ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మొహంతి
  • - నాలుగు మున్సిపాలిటీల్లో పీవోలు, ఏపీవోలకు శిక్షణ


గద్వాల/అలంపూర్‌ నమస్తే తెలంగాణ/ అయిజ/వడ్డేపల్లి : ఈ నెల 22న మున్సిపల్‌ పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మొహంతి పీవోలు, ఏపీవోలను ఆదేశించారు. పోలింగ్‌ రోజునఓటర్లను గుర్తించడంలో ప్రిసైడింగ్‌ అధికారులు  జాగ్రత్తగా వ్యవహరించాలని ఎట్టి పరిస్థితిలో టెండర్‌ ఓటు జరగకుండా చూసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతామొహంతి ప్రిసైడింగ్‌ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం  జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న నాలుగు పురపాలక సం ఘాల పరిధిలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌  అధికారుల ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ పురపాలక సంఘాల వారీగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గద్వాల పురపాలక సం ఘానికి సంబంధించి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల చింతల పేటలో శిక్షణ తరగతులను పరిశీలించి ఆమె మాట్లాడారు.  ఈ సారి ఎన్నికల్లో కేవలం ఫో టో ఓటర్‌ స్లిప్‌లను మాత్రమే తీసుక వ స్తే ఓటు వేయడానికి అంగీ కరించడం లేదని  దీనితో పాటు ఎన్నికల కమిషన్‌ అనుమతించిన 12 రకాల గుర్తింపు కా ర్డులతో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పని సరిగా వెంట తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. ఫారం -7కు బ్యాలె ట్‌ పేపర్‌ సరిపోయిందా లేదా ముందు గా చూసుకోవాలన్నారు. తప్పులు ఉం టే ముందుగానే గుర్తించుకోవాలన్నారు. ఉదయం 6 నుంచి 7గంటల ప్రాంతం లో  పోలింగ్‌ ఏజెంట్ల సమక్షంలో బ్యాలె ట్‌ బాక్స్‌లు డిమానిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఖచ్చితంగా ఉద యం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభించాలన్నారు. మార్క్‌ చేసిన ఓటర్‌ జాబి తా ఎట్టి పరిస్థితిలో బయటకు రావడానికి వీలు లేదన్నారు. ప్రతి రెండు గంటలకు  ఒకసారి పోలింగ్‌ శాతాన్ని తెలపాలన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరైతే పోలింగ్‌ స్టేషన్‌లో వరుస క్రమంలో ఉంటారో వారికి మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని 5గంటల తర్వాత ఎవరికి అనుమతించ బడదన్నారు. పోలింగ్‌ బూత్‌ల్లో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే రిపో ర్టు చేయాలని అధికారులకు సూచించారు.

అయిజ మున్సిపాలిటీలో..

అయిజ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం పీవోలు, ఏపీవోలకు పోలింగ్‌ ప్రక్రియ, మున్సిపల్‌ పోలింగ్‌ యాక్టు, పోలింగ్‌ నిర్వహణ, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ ..పోలింగ్‌ రోజున ఓటర్లను గుర్తించడాని అనుభవజ్ఞులైన ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులను మొదటి పోలింగ్‌ అధికారిగా నియమించాలన్నారు. బ్యాలెట్‌ పేపర్లను పీవోలు ముందుగానే పరిశీలించుకోవాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌, వీడియో చిత్రీకరణ ఉం టుందన్నారు. పీవోలు, ఏపీవోలతోపా టు వెబ్‌కాస్టింగ్‌, వీడియో గ్రాఫర్లు ఈ నెల 21 నాటికి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని పోలింగ్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి క్షణం పోలింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

మున్సిపల్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు ప కడ్బందీగా చేయాలని  ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మొహంతి అన్నారు. శుక్ర వారం అలంపూర్‌ మున్సిపాలిటీలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో నిర్వ హించిన పీవో, ఏపీవో ఎన్నికల సిబ్బం ది శిక్షణ కార్యక్రమానికి సందర్శించారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులకు షోకాజ్‌ నోటీసులు

 అలంపూరు మున్సిపాలిటీలో పీవో, ఏపీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్య క్రమానికి ఆలస్యంగా, గైర్హాజరైన సిబ్బం దికి ఇన్‌చార్జి కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. శిక్షణ కార్యక్రమాన్ని ఇన్‌ చార్జి కలెక్టర్‌ సందర్శించినప్పుడు సమా వేశంలో లేని 8మంది పీవోలు, 3 ఏపీ వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మే రకు వారికి షోకాజ్‌ నోటీ సులు ఇవ్వను న్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.

ఏర్పాట్లను పరిశీలన

వడ్డేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్ల ను ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మొహంతి పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఎన్ని కల పోలింగ్‌ ఆఫీసర్ల శిక్షణా కార్యక్ర మంలో పాల్గొని వారి విధి విధానాలను గుర్తు చేశారు. బాధ్యతలు చేపట్టిన ప్రతి ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని ముం దుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలింగ్‌ సజావుగా జరిగేందుకు కృషి చేయాలని అన్నారు. ఆయా కార్యక్ర మంలో జేసీ నిరంజన్‌, ఆర్డీవో రాము లు, నోడల్‌ అధికారి ఆదిత్యకేశవసాయి, మున్సిపల్‌ కమిష నర్లు నర్సింహా, యా దగిరి, పార్థసారధి ఇన్‌చార్జి కమిషనర్‌ మదన్‌ మోహన్‌, ఎంపీడీవో మల్లికా ర్జున్‌, తాసిల్దార్‌ వెంక టరమణ, పీవో లు, ఏపీవోలు, మున్సిపల్‌ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.logo