Snake soup | శీతాకాలంలో చైనీయులు పాము సూప్ తాగుతారు.. ఎందుకో తెలుసా..?
Snake soup | సాధారణంగా పామును చూస్తేనే జనం ఆమడ దూరం పరుగులు పెడుతారు. కానీ ఆ దేశంలో మాత్రం శీతాకాలం వస్తే పాములను చంపి, సూప్ చేసుకుని మరీ తాగుతారు. కార్న్ సూప్, చికెన్ సూప్, మటన్ సూప్ గురించి విన్నాం గానీ.. ఈ స్నేక్ సూప్ ఏందీ..? విచిత్రంగా అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. మీరు నమ్మి తీరాల్సిందే. చైనీయులు శీతాకాలంలో పాములను సూప్ చేసుకుని తాగుతారు. మరె ఎందుకో తెలుసా..? తెలియదంటారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి..
సాధారణంగా పామును చూస్తేనే జనం ఆమడ దూరం పరుగులు పెడుతారు. కానీ ఆ దేశంలో మాత్రం శీతాకాలం వస్తే పాములను చంపి, సూప్ చేసుకుని మరీ తాగుతారు. కార్న్ సూప్, చికెన్ సూప్, మటన్ సూప్ గురించి విన్నాం గానీ.. ఈ స్నేక్ సూప్ ఏందీ..? విచిత్రంగా అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. మీరు నమ్మి తీరాల్సిందే. చైనీయులు శీతాకాలంలో పాములను సూప్ చేసుకుని తాగుతారు. మరె ఎందుకో తెలుసా..? తెలియదంటారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి..
కొద్ది కాలం క్రితం పిజ్జా హట్, సెర్ వాంగ్ ఫన్ అనే స్నేక్ ఫుడ్స్ రెస్టారెంట్ కలిసి హాంకాంగ్‌లో స్నేక్-సూప్ పిజ్జా అనే కొత్త వంటకాన్ని సృష్టించాయి. ఈ వంటకం చైనా అంతటా చర్చనీయాంశమైంది. స్నేక్ సూప్ పిజ్జా అంటే.. పిజ్జాతోపాటు ఒక కప్పులో స్నేక్ సూప్ ఇస్తారు. అయితే ఈ కాంబినేషన్ మంచిదేనా.. ఆరోగ్యానికి సురక్షితమేనా..? అనే అనుమానాలు తలెత్తాయి. ఆఖరికి ఆరోగ్యానికి మంచితే అని తేలడంతో దీన్ని అక్కడి ప్రజలు విపరీతంగా ఆస్వాదిస్తున్నారు.
స్నేక్ సూప్ కొత్త వంటకం కాదు
ఈ స్నేక్ సూప్ కొత్త వంటకం కాదట. పురాతన కాలం నుంచే చైనా వంటకాల్లో స్నేక్ సూప్ ప్రధాన వంటకంగా ఉన్నదట. అయితే ఇప్పుడు పిజ్జాతో జతగా తీసుకొచ్చిన స్నేక్ సూప్ పిజ్జా అనేది కొత్త కాంబినేషన్. కాంటోనీస్ వంటకం అయిన స్నేక్ సూప్ చైనాలో బాగా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా శీతాకాలంలో స్నేక్ సూప్ రుచిగా, మంచి వాసనతో ఉంటుందని ఆ వంటకం నిపుణులు చెబుతున్నారు. అందుకే చైనాలో ఈ స్నేక్ సూప్‌ను ఎక్కువగా శీతాకాలంలోనే ఆస్వాదిస్తారని తెలిపారు. దక్షిణ చైనాలో రెండు వేల ఏండ్ల క్రితమే స్నేక్ సూప్ వంటకాల్లో భాగంగా ఉందని అన్నారు.
ఆరోగ్య ప్రయోజనాలూ మెండు
ఈ స్నేక్ సూప్‌తో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయట. విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని, నిద్రను మెరుగుపరుస్తుందని, క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుందని స్నేక్ సూప్ స్పెషలిస్టులు చెబుతున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా, కొవ్వులు తక్కువగా ఉండే ఈ వంటకం జీర్ణశక్తిని పెంచడానికి, శరీరంలోని విషాలను తొలగించడానికి కూడా తోడ్పడుతుందని అంటున్నారు. ఈ స్నేక్ సూప్‌కు సంబంధించిన మూల పదార్థాలను 12 గంటలకు పైగా ఉడికించి.. ఆ తర్వాత వాటికి పాము మాంసం ముక్కలు, అల్లం కలుపుతారని తెలిపారు. విష రహిత పాములతోపాటు, విష సర్పాలను కూడా ఈ సూప్ తయారీకి వినియోగిస్తారని చెప్పారు.
Read Today's Latest Evergreen News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
New Plant | అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
విద్యుత్ షాక్‌తో పాడి బర్రె మృతి
కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

