సీటెట్ అప్లికేషన్లు ప్రారంభం..
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి. ఉపాధ్యాయ అర్మత పరీక్షను ఈ ఏడాది ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు సీబీఎస్సీ ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పరీక్షలో 60 శాతం మార్కులు సాధించినవారిని అర్హులుగా పరిగణిస్తారు.
అర్హత: బీఈడీ, డీఈడీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
రాతపరీక్ష: డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పరీక్ష విధానం
రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు మొదటి పేపర్, ఆరు నుంచి 8వ తరగతి వరకు పేపర్-2 ఉంటుంది.
పేపర్-1: పరీక్ష మొత్తం 150 మార్కులు. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెక్షన్ 30 నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
పేపర్-2: మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొదటి మూడు సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడుగుతారు. మిగిలిన రెండు సెక్షన్లకు 60 మార్కుల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, రెండు పేపర్లు అయితే రూ.1200. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500, రెండు పేపర్లు అయితే రూ.600
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 20
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 19
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 20
వెబ్సైట్: ctet.nic.in
Read Today's Latest Eligibility-tests News in Telugu and Telugu News
- Tags
- Applications
- CBSE
- CTET
- registration
RELATED ARTICLES
తాజా వార్తలు
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

