అర్హులందరికీ పెట్టుబడి సాయం ఇవ్వాలె!
ఆర్థికంగా వెనుకబడిన రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన పథకం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’.
ఆర్థికంగా వెనుకబడిన రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన పథకం ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’. అర్హులైన అనేకమంది రైతులకు ఈ పథకం అందడం లేదు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి కొత్త లబ్ధిదారులను చేర్చకపోవడంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పెట్టుబడి సాయాన్ని అందుకోలేకపోతున్నా రు. రైతులకు సంబంధించిన పథకం కాబట్టి లబ్ధిదారుల ఎంపికను నిరంతర ప్రక్రియగా చేపట్టాలె. అప్పుడే అర్హులందరికీ ప్రయోజనం చేకూరుతుంది.
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథక రూపకల్పన సమయంలో 2018 కంటే ముందు పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు మాత్రమే అర్హులుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు వారికే పెట్టుబడి సాయం అందుతున్నది. 2018 తర్వాత నమోదైనవారికి ఆ పథకం కింద పెట్టుబడి సాయం అందటం లేదు. కాబట్టి ఈ పథకానికి అర్హులైన రైతులను లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి. అంతేకాకుండా, ఏడాదికి రూ.6000గా ఉన్న సాయాన్ని రూ.10 వేలకు పెంచాలి. సాగు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– గుండమల్ల సతీష్ కుమార్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

