వేణుశ్రీ రచించిన ‘కైరవ శతకం’ పుస్తకావిష్కరణ ఏప్రిల్ 17న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు కందుకూరి శ్రీరాములు అధ్యక్షత వహించగా, నందిని సిధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. మామిడి హరికృష్ణ, అయాచితం శ్రీధర్, గండ్ర లక్ష్మణరావు, బెల్లంకొండ సంపత్ కుమార్, కూకట్ల తిరుపతి, తంగిరాల చక్రవర్తి, రూప్‌కుమార్ డబ్బీకార్, పటేల్ రాజమణి పాల్గొంటారు.
– తెలంగాణ రచయితల సంఘం, జంట నగరాలు
తెలంగాణ బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మే 5 నుంచి 20 వరకు 4 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉచిత సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాం. పేపర్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్/ పెయింటింగ్, పాటల శిక్షణ, తెలుగులో రాయడం/ చదవడం, అందమైన చేతిరాత, స్పోకెన్ ఇంగ్లీష్, స్పెల్ గేమ్, ఇండోర్ గేమ్స్ లఘు నాటికలు (స్కిట్స్) శాస్త్రీయ నృత్యాల వంటి రంగాల్లో శిక్షణలు ఇస్తారు. ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు 94900 98343, 94900 98676 వాట్సాప్ నెంబర్లలో విద్యార్థుల పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– భూపతి వెంకటేశ్వర్లు, ఎన్.సోమయ్య
చాలా చీకటి రాత్రుల తర్వాత
చిన్న దీపం వెలిగించుకొన్నాను.
ఇంతలోనే ఎవడో రాయి విసిరి,
తుఫాను దాడి చేయడానికి..
కిటికీ అద్దాలు పగల గొట్టాడు.
బయటికి ఎంత విరగబడి నవ్వినా,
లోపలి బాధ తగ్గడం లేదు.
ఎన్ని గాయాలు చేస్తారో చేయనీ..
నవ్వుతూ బతుకడమే నాకున్న అందం..
హోరు దాచుకొన్న ఒక్క శ్వాస,
పేరు తెలియని పెద్ద పక్షి రెక్కల శబ్దం లాంటిది,
అది ఏ కోట మీద వాలినా,
రాజ్యం కూలిపోయి శిథిలమవుతుంది.
ఆశారాజు: 99898 98954