భారత రాష్ట్ర సమితి మహిళాభ్యుదయ దిశా నిర్దేశంలో తనదైన శైలిని కలిగి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళలకోసం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం మహిళలకోసం ఎంచుకున్న సంక్షేమ పథాన్ని ధృవీకరిస్తున్నవి. రెండు పర్యాయాలు అధికారంలో ఉండి ప్రభుత్వం అమలు పరిచిన కార్యక్రమాలు మహిళలకు అందిస్తున్న చేయూతకు అద్దం పడుతున్నాయి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అమలుకు బిల్లు ప్రతిపాదించిన సందర్భంలో భారత జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత పోషించిన క్రియాశీల పాత్ర మహిళాభ్యుదయానికి బీఆర్ఎస్ ఎంతగా పాటు పడుతుందనేది చెప్తున్నది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమికను పోషించిన మహిళలకోసం తెలంగాణలో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిన పథకాలు అనిర్వచనీయమైనవి. మహిళను సమాజ పరిణామక్రమంలో ముందుకు తీసుకుపోయేందుకు ప్రభుత్వం అమలు చేసిన ప్రోత్సాహకాలు ఇక్కడ ఉదహరించాలి. బాలికా స్థాయినుంచే ఈ ప్రోత్సాహకాలు రాష్ట్రంలో అమలవుతున్న తీరు బాలికా విద్యను ముందుకు తీసుకుపోయే రీతిలో ఉపకరించాయి. విద్యార్థి దశలో బాలికా విద్య కొనసాగింపునకు ప్రేరణగా అమలైన పథకాలు యుక్తవయసులో ఆడ పిల్ల పెండ్లికి తెలంగాణలో వినూత్నంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లు మహిళా సంక్షేమానికి ఊతంగా ప్రభుత్వం చూపే చొరవకు తార్కాణంగా నిలిచాయి.
చదువు, పెండ్లి రెంటికీ ఆడపిల్లలున్న కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గర్భిణులకు అందిస్తున్న సహకారం దేశ చరిత్రలో వినూత్న అధ్యాయానికి తెరలేపింది. ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీ అయిన మహిళలకు కేసీఆర్ కిట్ పేరిట అందించే ప్రోత్సాహకం బహుళ ప్రయోజనాలకు నాం దిగా నిలుస్తున్నది. కేసీఆర్కిట్ వంటి వినూత్న ప్రోత్సాహకం దేశ చరిత్రలోనే ఒక గొప్ప పథకంగా నిలిచింది. దీనివల్ల ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీలు పెరిగా యి. దీనికి తోడు గర్భి ణు ల కోసం ప్రత్యేకంగా అమ లు చేస్తున్న న్యూట్రిషన్ కిట్ కూడా మహిళా ఆరోగ్యంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు తార్కాణం గా నిలుస్తున్నది.
ఇవన్నీ విద్య, ఆరోగ్య, కుటుంబ పరమైన ప్రో త్సాహకాలుగా నిలుస్తున్న దశలోనే వివిధ రంగాల్లో ని మహిళలు పొందుతున్న ఆర్థిక సహాయా లు మహిళలకు ఆసరాగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పథకం, ఒంటరి మహిళ, వితంతు పింఛన్ పథకాలు మహిళ తనకాళ్లపై తాను నిలబడే రీతిలో ఉపకరిస్తున్నవి. మహిళారైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఇవ న్నీ ఒక ఎత్తయితే కుటుంబ పోషణలో భాగస్వామిగానే కాకుండా ప్రధాన భూమికను పోషించే తరహాలో బీఆర్ఎస్ రూపొందించి అమలు చేస్తున్న పథకాలు మహిళలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ పథకంలోనూ మహిళది కీలక భూమిక. తమ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషించే మహిళ వంటింటి అవసరాల కోసం పలు రాయితీలను అమలు పరుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఈసారి రెండు వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. పేద కుటుంబాలకు 4 వందలకే గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్టు ప్రకటించింది. అలాగే పేద మహిళలకోసం సౌభాగ్య లక్ష్మి పేరిట అమలులోకి తీసుకురానున్న మరో పథకం బీఆర్ఎస్ను ఆకాశానికెత్తింది.
ఈ పథకం ద్వారా మహిళకు ప్రతినెల రూ.3 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తామని బీఆర్ఎస్ హామీనిస్తున్నది. ఇది మహి ళలకు ఆర్థిక శక్తినిచ్చే గొప్ప పథకం. ఇలా అన్ని రంగాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న బీఆర్ఎస్ ప్ర భుత్వం అన్నింటా మహిళలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నది.
-డాక్టర్ కడియం కావ్య
98858 56065