ఐక్యతా రాగాన్ని ఆలపించాలి
వాళ్లు బానిస సంకెళ్ళపై ఎర్రటి పొద్దు పొడుపై పొడిచారు సమస్యల భాస్వరాన్ని మండిస్తూ ఏకత్వ దారాలను బలంగా పేనారు
వాళ్లు బానిస సంకెళ్ళపై
ఎర్రటి పొద్దు పొడుపై పొడిచారు
సమస్యల భాస్వరాన్ని మండిస్తూ
ఏకత్వ దారాలను బలంగా పేనారు
ప్రశ్నల కొడవళ్ళను విసిరేస్తూ
మాటల ఫిరంగులను పేల్చారు
ఉరికొయ్యలపై ఉయ్యాలలూగుతూ
ఉద్యమాల ఊట చెలిమలను తవ్వారు
తెల్లోడి గుండుకు గుండెను చూపుతూ
వలసవాదులపై ఉరుములై ఉరిమారు
వారి ఊపిరి దీపాలను ఆర్పేసుకొని
మనకు స్వేచ్ఛా కాగడాను అందించారు
వారి జీవితాలను దేశానికి అరణం ఇచ్చి
మనకు స్వాతంత్య్ర ఫలాల తోటను నాటారు
వాళ్ళ రుధిరాలతో ఈ ధరణిని తడిపి
మనకు చైతన్య విత్తనాలను చల్లారు
ఇప్పుడు మనం వారి త్యాగాల గంధాన్ని
ఒళ్ళంతా పూసుకొని కదనరంగమై కదలాలి
వారిచ్చిన స్ఫూర్తి పతాకాన్ని ఎదనిండా
ఎగరేసుకొని దేశ సేవలో మునిగిపోవాలి
మానవత్వపు పూల వంతెనపై నడుస్తూ
కులమత స్తంభాలను కూలదోయాలి
ఐక్యతారాగాన్ని ఆలపిస్తూ
జగతికి దిక్సూచిగా మారాలి
- తాటిపాముల రమేష్
79815 66031
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

