రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లడానికి సోషల్ మీడియాకు మించిన అస్త్రం మరొకటి లేదు. వీటిలో బీజేపీ సోషల్ మీడియాకు మించింది లేదని గిట్టని పార్టీలు సైతం కితాబు ఇస్తుంటాయి. ప్రత్యర్థులపై బురద జల్లడం ఒక్కటే కాదు, ప్రత్యర్థుల పోస్టులను కనిపించకుండా చేయడంలో కూడా బీజేపీ వింగ్‌కు దిట్టగా పేరుంది. దీనికోసం ప్రత్యేకంగా అమిత్ మాలవీయ అనే అతన్ని జాతీయ కన్వీనర్‌గా పెట్టుకుంది. తెలంగాణ బీజేపీలో తగాదాలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఆరా తీయమని జాతీయ వింగ్‌ను ఆదేశించింది. వారు కూపీ లాగితే రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచేనని బయటపడింది. పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయినట్టు సోషల్ మీడియా ఉద్యోగులు కూడా విడిపోయి సొంత పార్టీ నేతలపై పోస్టులు పెట్టినట్టు తేలింది. ఇంకేముంది? తమ నాయకుడిపైనే పోస్టులా? అంటూ డిష్యూం… డిష్యూం. పార్టీ జీతాలు ఇచ్చి పెట్టుకున్నది సొంత పార్టీ నేతలపై పోస్టులు పెట్టడానికా? అని వారిని మందలించినట్టు వినికిడి.