కర్షకుల కన్నీళ్లను తుడవకుంటే
వారి బతుకంతా బరువెక్కిన బాధల గూడే వారి గమనమంతా కన్నీటి పేజీల గాథలే వారి కాయాన్ని ఎక్కడ కదిపినా వ్యథల తూట్లే జిందగీ మొత్తం చెమటచుక్కల అత్తరులే
వారి బతుకంతా బరువెక్కిన బాధల గూడే
వారి గమనమంతా కన్నీటి పేజీల గాథలే
వారి కాయాన్ని ఎక్కడ కదిపినా వ్యథల తూట్లే
జిందగీ మొత్తం చెమటచుక్కల అత్తరులే
మండేసూర్యున్ని నెత్తినెట్టుకొని
ఎముకల గూడుకు బుర్దను పూసుకొని
వరికంకిలా వంగిపోయి ఆరుగాలం కష్టపడి
కంచంలో బువ్వ పూలు పూయించే రైతు
నేడు దళారుల చేతుల్లో శీకిన బొక్కైతాండు
ఏలికల చేతుల్లో చెల్లని ఓటైతాండు
పైరుకు పానం పోసినోడు పాడెక్కుతుంటే
నక్లి ఇత్తనపోళ్ళు ఇంపుగ ఇగురు బెడ్తాండ్రు
ఎలగబెట్తనన్న ఏలికలు ఏండ్లు గడిచినా
సట్టబండలై సడిలేకుండా సాగిపోతుంటే
కర్షకుల కన్నీళ్లు గోదారై పారుతున్నది
పాపం వాళ్లకు రెక్కలు ముక్కలు చేయడం
తెలుసు కానీ మోసపు మాటలు తెలియవు
చెమట చుక్కలు చిందించడం తెలుసు కానీ
తాగిన రొమ్ములను తన్నడం తెలియదు
మట్టిని పిసకడం తెలుసును కానీ
మనుషులను మట్టుపెట్టడం తెలియదు
అన్నదాతను ఆదుకోకుంటే
జగతి శవపేటిక కావడం ఖాయం
కర్షకుల కన్నీళ్లను తుడవకుంటే
ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం
– తాటిపాముల రమేశ్ (తార)
79815 66031
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Annadata
- Congress govt
- farmers
- poem
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

