నిప్పుల మీద నడ్శినా నీళ్లు దొర్కని న్యాల మాది
గడ్డిపోస గుడ మొల్వని గడ్డ పాలమూరు
నీళ్లు లేక పచ్చదనమంతా వలసవోయింది
ఎవుసమంటే మా ఒంట్ల నెత్తురును దున్నుకునుడే గానీ..
పొలాలకు నీళ్లు గట్టిన రోజులు మా కండ్లకు ఎన్నడూ ఎర్కలే
కానీ ఈ దినం చంద్రశేఖరుడు కృష్ణమ్మను మలిపి
మా కన్నీళ్లకు ఆనకట్ట వేసి
పాలమూరు ప్రాజెక్టు గట్టిండు..
గెలువదనుకున్న పాలమూరు ఇయ్యాల
పంచెకట్టుకొని ముస్తాబైంది
పడగ విప్పిన రాళ్లన్నీ నూతిల
బొక్కెన మునిగినట్లు మునుగుడే ఇక
సంకెళ్లేసిన భూములకు నేటితో విముక్తి దొరికింది
బీడువారిన నేల నోర్దెర్సి ఎదిరిసూస్తున్నది
దసరా పండుగ కంటే ముందుగాళ్ల
మా సారు నీళ్ల పండుగ వట్కచ్చిండు
మాశివోయిన మా భూమికి ఇయ్యాల కొత్తంగి తొడ్గినట్టే..
ఎక్కిరిచ్చిన పాలమూరుకు పందిరేసిండు
రైతన్నల గోసలు నీళ్లళ్ల కొట్టుకపోయి…
మా నేలంతా ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది
నూనె ఉంటే దేవునికి దీపం వెట్టచ్చేమో…
కానీ, నీళ్ల్లుంటే ఆ దేవునికి నైవేద్యం గూడ వెట్టచ్చు..
అసొంటి నీళ్లు దెచ్చిన మా సారు మా
తెలంగాణకు ఒక వరం లెక్కనే..
– తుమ్మల కల్పనారెడ్డి 96404 62142