కేసీఆర్.. తెలంగాణ స్పార్టకస్
ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాల్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణా, గోదావరి జలాలతో దూప తీర్చినోడు అన్నం మెతుకు దొరకని తెలంగాణను అన్నపూర్ణగా మార్చినోడు షాకులు ఇచ్చే కరెంటును సరిచేసి 24 గంటలు వెలుగులు
అవును
ఆయన స్ట్రెచర్ మీద ఉన్న తెలంగాణ వాదానికి ఊపిరి పోసి రాష్ర్టాన్ని డెలివరీ చేసినవాడు
అవును
ఆయన మార్చురీకి మర్లుతున్న రైతుల జీవితాల్ని మార్చడానికి భగీరథ తపస్సు చేసినవాడు వలస పాలకుల చేతిలో జీవచ్ఛవంలా ఉన్న తెలంగాణకు జీవం పోసినోడు నీళ్లు లేక నెర్రలు బారిన ఈ నేలకు కృష్ణా, గోదావరి జలాలతో దూప తీర్చినోడు అన్నం మెతుకు దొరకని తెలంగాణను అన్నపూర్ణగా మార్చినోడు షాకులు ఇచ్చే కరెంటును సరిచేసి 24 గంటలు వెలుగులు విరజిమ్మేలా చేసినోడు బక్క పలచని మనిషైనా ఉక్కు గుండె గలవాడు తెర్లయిన తెలంగాణ బతుకులకు తెరచాపై గమ్యం చూపినవాడు స్టేచర్ ఉత్తగనే రాదు ప్రజలే ప్రాణం అనుకుంటే వస్తది మంది మీద పొద్దుపోతే రాదు, మనసు పెట్టి పని చేస్తే వస్తది ఆయన ఎన్నడూ నీలాగా పదవుల కోసం పలవరించలే… గడ్డిపోస లెక్క పదవుల్ని విసిరేసి తెలంగాణను గెలిచి ప్రజల హృదయాలో కొలువైనాడు స్ట్రెచర్ మీద ఉన్న తెలంగాణకు ఆయన జీవగంజి పోసి బతికిస్తే, నువ్వు అదే తెలంగాణను మార్చురీకి పంపే ప్రయత్నం చేస్తున్నవ్ కేసీఆర్ తెలంగాణ పతారా పెంచి ప్రపంచంతో పోటీపడి పనిచేస్తే నువ్వు చౌకబారు మాటలతో చేతకాక దివాలా తీయిస్తున్నవ్ నీలాంటి అల్పులు ఎంత గీపెట్టినా ఆయన వెరవడు వెయ్యి ఏనుగుల బలాన్ని కూడదీసుకొని మళ్లీ వస్తాడు నిన్నూ, నిన్ను ఆడిస్తున్న వాళ్ల ఆట కట్టిస్తాడు తిరిగి తెలంగాణను నిలబెట్టి గెలిపిస్తాడు ఎక్కడ ఉన్నా ఆయన కేసీఆర్ తెలంగాణ స్పార్టకస్!
మాదాసు శ్రీనివాస్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

