విధ్వంసమవుతున్న వైవాహిక బంధం?
ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన, పవిత్రమైన వివాహ బంధం భారత వివా హ వ్యవస్థ. ఇది ఆధునిక సంస్కృతి విషపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. పాశ్చాత్యీకరణ మోజులో భార్యభర్తల మధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన, పవిత్రమైన వివాహ బంధం భారత వివా హ వ్యవస్థ. ఇది ఆధునిక సంస్కృతి విషపు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నది. పాశ్చాత్యీకరణ మోజులో భార్యభర్తల మధ్య పరస్పర అనుమానాలు, అపనమ్మకాలు కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. క్షణకాల ఆనందం కోసం వేస్తున్న తప్పటడుగులు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.
మూడు ముళ్లు, ఏడడుగులతో భా ర్యా భర్తల మధ్య ఏడేడు జన్మ ల బంధాన్ని ముడివేయగలుగుతుంది వివాహవ్యవస్థ. కానీ ఆ వ్యవస్థ సమాజపు నమ్మకాన్ని నిలుపుకోలేకపోతున్నది. కలకాలం తోడు నీడగా ఉంటామని వేదమంత్రాల సాక్షిగా వాగ్దానం చేసి న వారే నిర్దాక్షిణ్యంగా తమ జీవిత భాగస్వాములను కడతేరుస్తున్నారు. అక్రమ, వివాహేతర సం బంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు సామాజిక అల్లికను ఛిద్రం చేస్తున్నాయి. మరోజన్మ మాటేమోకానీ ఈ జన్మలోనే ఆత్మీయతానుబంధాలతో అన్యోన్యమైన వైవాహిక జీవనం కరువవుతున్నది. ఆదర్శ కుటుంబ వాతావరణాన్ని సృష్టించలేక పోతున్నది.
మానవీయ విలువలు మాయమవడానికి కా రణాలు అనేకం. ఆధునిక నాగరికతలో అంతర్భాగాలైన రియాల్టీ షోలు, టీవీ సీరియల్స్, ఓటీటీ లు, సోషల్ మీడియా ప్రజలను సోషల్ లైఫ్లో విచ్చలవిడితనం వైపు నడిపించడానికి ప్రేరేపిస్తున్నాయి. వీటి మూలంగానే దంపతుల మధ్య అనవసర అపార్థాలు సృష్టించబడుతున్నాయి. మరోవైపు పోర్న్ సైట్లు, నీలి వీడియోలు విచ్చల విడి శృంగారానికి ఆజ్యం పోస్తున్నాయి. ఆధునిక నాగరికతలో భాగంగా పెళ్ళికి ముందు జరుగుతున్న డేటింగ్లు, భార్యాభర్తలు కాకున్నా స్నేహితులు గా కలిసి సేదదీరే అవకాశాలను కల్పిస్తున్న కొన్ని లాడ్జీలు అపశృతులకు కారణమవుతున్నాయి.
ఆధునిక దాంపత్య జీవన ప్రక్రియ వివాహం చేసుకోకుండానే సహజీవనం చేసే వెసులు బాటు ను కలిపిస్తున్నది. దీన్ని సమాజం అంగీకరించడంతోపాటు ప్రపంచీకరణ ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుం టూ న్యాయవ్యవస్థ కూడా బలపరుస్తున్నది. సదరు జీవనం పట్ల అన్ని ప్రాంతాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దానికి పెరుగుతు న్న ఆదరణ ఫలితంగా పట్టణా లు, పల్లెలనే తేడా లేకుండా వి వాహేతర సంబంధాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కేవలం ఆకర్షణతో అవగాహన రాహిత్యంతో తమ సంసారాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఆ క్షణికావేశంలో తమ జీవిత భాగస్వాములతోపాటు కన్నబిడ్డలను సైతం బలితీసుకుంటూ నేరస్థులుగా మిగిలిపోతున్నారు.
ఆధునిక సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సామాజిక రుగ్మతలను, దురాచారాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన మీడియా కేవలం బ్రేకింగ్న్యూస్తో సరిపెట్టుకుంటున్నది.సామాజిక తప్పిదాలను ఎత్తిచూపే బాధ్యతను త్రికరణశుద్ధిగా నిర్వర్తించాల్సిన పత్రికలు, ప్రసారసాధనాలు రేటింగ్ కోసం పోటీపడుతున్నాయి. అమానవీయ సంఘ టనలు జరగడానికి గల కారణాల మూలాల్లోకి వెళ్ళి వాటి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్య ల గురించి చర్చించక పోవడం దురదృష్టకరం. దీంతో అలాంటి ఘటనలే మళ్ళీ మళ్ళీ జరుగుతుండడం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది.
లైంగిక సంబంధాలే మానవ జాతి పునరుత్పత్తికి అనివార్యమైన పరిస్థితుల్లో సదరు లైంగిక సంబంధాలలో ఏది నైతికం, ఏది అనైతికమనే విశ్లేషణతో కూడిన చర్చ సాగాలి. మానవీయ విలువలను కుటుంబాలే కేంద్ర బిందువుగా పౌర సమాజమే ప్రజలకు బోధించాలి. లేని పక్షంలో సదరు అనైతిక లైంగిక సంబంధాలే ప్రజల సంసార జీవనంలో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వాటి ఫలితంగా పశుప్రవృత్తితో అత్యంత క్రూరమైన ‘అనుమానపు హత్యలు’ పెట్రేగే ప్రమాదం లేక పోలేదు.
దీని నివారణకు ప్రతి కుటుంబం ఉగ్గుపాలతోనే తమ తమ కుటుంబ సభ్యులకు నైతిక విలువలను అందించాలి. అలాంటి కుటుంబాల సమాహారమే ఓ ఆదర్శ సమాజ నిర్మాణానికి పునాదిగా మారుతుంది.ఆరోగ్యకరమైన సామాజిక వ్యవస్థకు ఇరుసు లాంటి కుటుంబాలు నైతిక విలువలను ప్రభోధించే కేంద్రాలుగా వ్యవహరిస్తూ ఓ ఆదర్శ సమాజ నిర్మాణానికి ఊపిరులూదాలి.
డాక్టర్ నీలం సంపత్: 9866767471
( వ్యాసకర్త : విశ్రాంత డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్,సామాజిక కార్యకర్త)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

