కలిసి సాగితేనే సాకారం
ఆశయం, ఆయుధం కన్నా బలమైనది. ప్రపంచంలో అనేక గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది, మానవాభ్యుదయాన్ని ఆకాంక్షించిన ఉత్తమ ఆశయాలే!
ఆశయం, ఆయుధం కన్నా బలమైనది. ప్రపంచంలో అనేక గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది, మానవాభ్యుదయాన్ని ఆకాంక్షించిన ఉత్తమ ఆశయాలే! సామాజిక దురాచారాల నుంచి సంఘ సంస్కరణల వైపు మళ్లినా, పీడనను ఎదుర్కొని విముక్తిని సాధించినా, అశాస్త్రీయ ఆలోచనలను రూపుమాపి, శాస్త్రీయ ఆవిష్కరణలు గావించినా, చివరికి వివక్ష విషసర్పమై కాటేసిన సీమాంధ్రుల దోపిడీనీ ఎదిరించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నా వీటన్నింటి వెనుకా చోదకశక్తిగా పనిచేసింది. మార్పు వైపు నడిపించిన ఒక సదాశయమే!
జనహితాన్ని కాంక్షించే ఏ పనికి పూనుకోవాలన్నా, మనకున్న అన్ని శక్తులకన్నా ముందుగా ఒక బలమైన ఆశయాన్ని నిర్మించుకోవాలి. తెలంగాణ సాధకుడైన కేసీఆర్ అంతి మ ఆశయం బంగారు తెలంగాణ నిర్మాణం. అది సాధ్యం కావాలంటే అత్యధిక ప్రజలు నివసిస్తున్న పల్లెలు స్వావలంబన సాధించాలి. దీన్ని సాకారం చేయడానికి కేసీఆర్ ‘గ్రామజ్యోతి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం విజయవంతం కావాలంటే నిధులు కేటాయిస్తే సరిపోదన్న విషయం కు తెలుసు. 1950 నుంచే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అనేక కమిటీల సూచనల మేరకు ప్రయత్నాలు సాగించినా ఆశించిన మేర అభివృద్ధి సాధ్యం కాలేదు. అందుకే దూరదృష్టి కలిగిన కేసీఆర్ ప్రజల భాగస్వామ్యం పూర్తిస్థాయిలో లేనిదే ఏ పథకమూ విజయవంతం కాదని, అందుకోసం తానే బరిలోకి దిగి ప్రజలను భాగస్వాములను చేస్తూ పల్లె ప్రగతి పథకాన్ని బలమైన ఆశయంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. యావత్ ప్రజాప్రతినిధులను, యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తున్నారు.
చైనాలో విప్లవం విజయవంతమయ్యాక, సాంస్కృతిక విప్లవానికి తెరలేపాడు మావో!ఓడిపోయిన శక్తులు తిరిగి కుట్రలు సాగిస్తాయని, ఆ కుట్రలు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తాయని ప్రజలకు ఈ కుట్రలను విప్పిచెప్పడంతో పాటు, కుట్రదారుల్ని అణచివేస్తూ, ప్రజల్లో సోషలిస్టు భావజాలాన్ని బలంగా స్థిరపరిచే ఉద్దేశంతో సాంస్కృతిక విప్లవాన్ని ప్రతిపాదించాడు మావో. ఇప్పుడు తెలంగాణ పట్ల కూడా అలాంటి కుట్రలే తెరపైకి వస్తున్నాయి. ఓడిపోయిన తెలంగాణ వ్యతిరేక సీమాంధ్ర వక్తులు, వారి తాబేదార్లు తెలంగాణ సమాజంలో గందరగోళాన్ని సృష్టిం చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఎన్ని అభివృద్ధి పథకాలకు అంకురార్పణ చేసినా, వాటిని విఫలం చేసే శక్తులు కూడా కోరలు విప్పుతాయి. కేసీఆర్ సాంస్కృతిక పునాదిని బలోపేతం చేసే ఆశయంతో పల్లెప్రగతిని వేదికగా చేసుకున్నారు.
సాంస్కృతిక వికాసమే సామాజిక అభివృద్ధికి దారితీస్తుంది. అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుంటూనే అసలైన తెలంగాణ ఆత్మ ను ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. పల్లె జీవితంలోని మానవీయ విలువలను తిరిగి పాదుకొల్పేందుకు ప్రయత్ని స్తూ, తమ ప్రసంగాల్లో వాటికి పెద్దపీట వేస్తున్నారు. పరాధీనతా భావాన్ని వీడి, ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకోవాలని, కాళ్లు మొక్కడం, ఏడుస్తూ బాధామయ జీవితాన్ని జీవించడం కాకుండా, మన జీవితాన్ని మనమే గెలుచుకోవాలని పిలుపునిస్తున్నారు. వ్యక్తి బాధ్యతను, వ్యక్తిశీలతను పెంపొందించుకునేలా దిశానిర్దేశనం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో పండే పంటలు వాటిని మార్కెట్ చేసుకోవడం, చేసుకునే వృత్తులు, వాటిద్వారా స్వావలంబన పొందడం గురించిన ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో విద్య, వైద్యం, పారిశుధ్యం, హరితహారం, ఇంకా అనేక విషయాల్లో ప్రజలే బాధ్యత వహించి, ప్రజలే సమస్యల పరిష్కారాన్ని వెతుక్కొనేలా చేస్తూ వర్క్ కల్చర్‌ను డెవలప్ చేస్తున్నారు.
పల్లె జీవన నేపథ్యంలోంచి వచ్చిన కేసీఆర్‌కు, ఆ గ్రామీణ జీవనవిధానం పరిఢవిల్లాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నది. ఆధునిక అభివృద్ధి నమూనాలను అందిపుచ్చుకుంటూనే, అభివృద్ధికి మానవీయ కోణాన్ని నిర్దేశించుకోవాలి అని తపన పడుతుంటారు. పిలిచి తమ సాంస్కృతిక మూలాలను బలోపేతం చేసుకుంటూ, అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కాలని పల్లె ప్రగతి ప్రధాన
ఉద్దేశంగా చెప్తారు.
దశాబ్దాల పోరాటాల అనంతరం అనేక త్యాగాల తదనంతరం, భావితరాలకు అద్భుత కానుకగా అందించిన అపూర్వ విజయాన్ని, దాని స్ఫూర్తిని పది కాలాల పాటు పదిలపరచాలి. తెలంగాణ అభివృద్ధికి పాలకుల విధానాల రూపకల్పన ఎంతైతే అవసరం ఉంటుందో, అంతకు రెట్టింపు ప్రాధాన్యం ప్రజల భాగస్వామ్యానికి ఉంటుంది. యాభై ఎనిమిదేండ్ల కిందట సాధారణంగా ఉన్న చిన్నదేశం సింగపూర్ నేడు ప్రపంచంలోని అనేక దేశాలకు రోల్‌మాడల్‌గా మారింది. ఇంకా ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలు నేడు ప్రగతిపథంలో పయనించగలుగుతున్నాయంటే అందుకు ఒకే ఒక కారణం.. ప్రజలకు, పాలకులకు అభివృద్ధిని ఆవిష్కరించే దృఢ సంకల్పం, దానికోసం కలిసి శ్రమించే కార్యచరణ ఉండటమే.
ఆరంభంలోనే పల్లెప్రగతి కార్యక్రమం అద్భుత విజయాన్ని సాధించింది. ప్రజలు అన్నిచోట్లా అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. కాలానుగుణమైన మార్పులను సంలీనం చేసుకుంటూ సాగిపోయే జనజాతర. ఈ పల్లె ప్రగతి ఆగిపోకుండా కాపాడే బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడిది. గుండెగుండెలో ఆకాంక్షించే చైతన్య జ్యోతులను వెలిగించాలి. విజయాల్ని, వైఫల్యాల్ని నిర్దేశించేది పవిత్రమైన ఆశ యం, ప్రయత్నలోపం లేని ఆచరణ.. ఈ రెండు కేసీఆర్‌లో అణువణువునా నిక్షేపమై ఉన్నాయి. ఆయన ఆశయానికి అండగా నిలుద్దాం.
నారదాసు లక్ష్మణ్‌రావు: 98490 59562
(వ్యాసకర్త: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

