గవర్నర్ ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధమే
ఏ రాష్ట్రానికైనా ప్రథమ పౌరుడు గవర్నరే. తెలంగాణ రాష్ర్టానికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ పదవిని హుందాగా నిర్వహించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ విషయంలో ఆమె తక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఏ రాష్ట్రానికైనా ప్రథమ పౌరుడు గవర్నరే. తెలంగాణ రాష్ర్టానికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ పదవిని హుందాగా నిర్వహించడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ విషయంలో ఆమె తక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాలి. కుటుంబ పెద్దగా రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేయడానికి అందరి కంటే ఎక్కువ కృషి చేయాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి గవర్నర్ మోకాలడ్డడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ పరిశీలనకు పంపిన బిల్లులను ఆమోదించాల్సిన గవర్నర్ వాటిని నెలల తరబడి పెండింగ్‌లో పెట్ట డం సరికాదు. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కొన్ని బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, కొన్ని బిల్లులను తిరిగి ప్రభుత్వానికి పంపడం వంటి చర్యలతో ప్రథమ పౌరురాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
గవర్నర్‌గా తెలంగాణలో అడుగుపెట్టింది మొ దలు ఏనాడు తెలంగాణ అభివృద్ధిని అభినందించింది లేదు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను గురించి ప్రశంసించింది లేదు. పైగా ప్రభు త్వ కార్యక్రమాలకు తనను పిలవడం లేదని బదు నాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణలో ఒక సామెత ఉంటది ‘పెండ్లికి పోతూ పిల్లిని తీసుకుపోరని’ కడుపునిండా విషం నింపుకున్న అవ్వ గుణం తెల్సి కూడా పేరంటాలకు ఎందుకు పిలుస్తారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ చర్యల ద్వారా రాష్ర్టాభివృద్ధికి అడ్డుపడుతున్న వారిని అంబేద్కర్ మహోన్నత విగ్రహావిష్కరణకు పిలవాలనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే ?
డాక్టర్‌బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొం దుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, ఆ మహోన్నత వ్యక్తిని సముచితం గా గౌరవించుకోవాలన్న సంకల్పంతో 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నది. ఆ కార్యక్రమానికి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్న గవర్నర్‌ను పిలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. అదే అంబేద్కర్ పేరుతో నిర్మించుకున్న తెలంగాణ కొత్త సచివాలయం విషయంలో కూ డా ఇది వర్తిస్తుంది కదా? ‘నన్ను పిలవడం లేదు, రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ప్రభుత్వం గుర్తించడం లేదని’ చెబుతున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రథమ పౌరురాలిగా తాను నిజమైన స్ఫూర్తితో పని చేస్తున్నారా లేదా అన్నది తక్షణం సమీక్ష చేసుకోవాలి. సమాంతర ప్రభు త్వం నడిపించాలనే తత్వంతో ఎప్పటికప్పుడు గవర్నర్ తన రాజ్యాంగ పరిధిని దాటుతూ, రాజకీయ విమర్శలకు పాల్పడుతూ వార్తల్లో ఉండాలనుకోవడం నిజంగా శోచనీయం. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసే విధంగా రాజకీయాలకు పా ల్పడటం,రాజకీయ ప్రకటనలు చేయడం, మీడియాతో ఉన్నవి లేనివి మాట్లాడటం సరైన చర్య లు కావని తెలుసుకోవాలి.గవర్నర్ పదవికి వన్నె తెచ్చే లాగా వ్యవహరించడం వీలుకాకపో తే… కనీసం మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించ కూడదు అన్న కనీస బాధ్యత ఉండాలి.గవర్నర్ పదవికి, రాజ్యాంగ స్ఫూర్తికి కనీస మర్యాద ఇచ్చే విధంగా గవర్నర్ ప్రథమ పౌరురాలిగా వ్యవహరించినప్పుడే ఆ పదవికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి అనే విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.తెలంగాణ రాష్ట్ర అవతరణ సమయంలో ఉన్న గవర్నర్ ఈ ఎల్ నరసింహన్ ఐదున్నర సంవత్సరాలు పనిచేసి కేసీఆర్ వ్యక్తిత్వం, పనితనంపై కితాబు ఇచ్చిన సంగతి మర్చిపోయారేమో.
ముఖ్యమంత్రి కలవడం లేదని పదే పదే ఆరోపిస్తున్న గవర్నర్ ఎప్పటికప్పుడు రాజకీయ విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే విధంగా ప్రయత్నిస్తున్నందుకు తనను కేసీఆర్ కలిసి కృతజ్ఞతలు చెప్పాలని భావిస్తున్నారా? ప్రథమ పౌరురాలిగా ఉంటూ రాష్ట్ర పౌరుల ప్రయోజనాల ను దెబ్బతీయడం సరికాదు. మొద టి నుంచి రాష్ట్ర ప్రభు త్వంతో సఖ్యత కలిగి ఉంటే ప్రతి కార్యక్రమానికి గవ ర్నర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వ యంగా ఆహ్వానించేవారు. ఆడబిడ్డ లను గౌరవించుకోవడం కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియద న్నది జగమెరిగిన సత్యం. బిల్లుల న్నీ ఆమోదించకుండా, ఆగమాగం చేయ డం మూలంగా రాష్ట్రంలో జరగాల్సిన అనేక అభి వృద్ధి పనులకు విఘాతం కలిగిన మాట వాస్తవం. అదీ గవర్నర్ వల్లే జరిగిందన్నది వాస్తవం. ఈ ప్రశ్నలకు గవర్నర్ దగ్గర సమాధానం ఉందా?
తెలంగాణ ప్రజలు ప్రేమకు ఆప్యాయతకు పెట్టింది పేరు. కుడుమంటే పండుగ అంటారు. అలాంటి ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించడం సరికాదు. కొత్త రాష్ట్రం, దేశంలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఈ క్రమంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా గవర్నర్ వ్యవహరించాల్సిన అగత్యం ఏమొచ్చిం ది. తమిళనాడులో నామమాత్రంగా ఉన్న వారి పూర్వ రాజకీయ పార్టీలో కొత్త అధ్యక్షుడు అన్నామలై రాకతో, వారి ప్రాభవం కొడిగడుతున్నదన్న బాధతో ఈ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్నా రన్న అపవాదు మూట కట్టు కోవడం తప్ప మరేం లేదు. ఇప్పటికైనా తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా సీఎం కేసీఆర్‌పై విషం చిమ్మ టం మానుకొంటే పదవికి గౌరవంగా ఉంటుంది.
డాక్టర్ సంగని మల్లేశ్వర్:98662 55355
(వ్యాసకర్త: జర్నలిజం శాఖ విభాగాధిపతి, కేయూ)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

