ముక్కోటి వృక్షార్చన

స్వప్నం ఉదయించడానికి ఒక వేకువ చాలు
మేల్కొలుపులో అది కొత్తరాగం అందుకుంటది
ఆ కల సూర్యుడిదే అయితే
దిక్కులన్నీ పులకరించి
స్వాగత వచనాల్ని పలుకుతయ్
ప్రతి హృదయం
తన చెట్టుతనాన్ని ద్విగుణీకృతం చేస్తది
ఇన్నాళ్ల కాలుష్యాన్ని కాటగలిపి
బతుకు జీవుల పంట పండేందుకు
పసిమొక్కల్ని నేలతల్లి ఒడిలో ఎదగనిస్తది
మనసులన్నీ తమ దోసిళ్లలో
పత్రహరితపు పవిత్రతను అంటుగడతవి
పల్లె, పట్నపు ప్రగతిదారులు, ఆవరణాలన్నీ
ముక్కోటి వృక్షార్చనతో
ప్రకృతి సోయగాల కళల్ని
కళ్లముందు నిలుపుకుంటవి
మన తెలంగాణ దేవత
తన సింగిడి వన్నెలకు మెరుపులద్దుకుంటది
వనిపాకల లచ్చిరెడ్డి
99668 97001
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

