కళకళలాడేరా నా తెలంగాణ
జలక్రీడలాడేరా నా తెలంగాణ
కవుల కలములలో కవితలై పారగా
గాయకుల గళములో గళమెత్తి పాడగా
చెరువులు కుంటలు నిండుగా పారగా
తూములు అలుగులు వరదలై పారగా
చెరువునిండి భూములు పండగా
పచ్చని పొలాలు సిరులతో పండగ
ఎండిన గొంతులకు తాగునీరందింప
పంట పొలాలకు సాగునీరందింప
మిషన్ కాకతీయతో చెరువులు నింపగా
మిషన్ భగీరథతో తాగునీరు పంపగా
పెట్టు బడికి రైతుబంధు తోడ్పడ
కర్షకుల మోములో హర్షంబు చూడగా
పాడిపంటలతో పరుగులెడుతుండగా
ఎవుసం నేడు పండుగను తలపింప
నిరుపేద కన్యలకు కల్యాణలక్ష్మి
ముస్లిం సోదరీలకు షాదీ ముబారక్
ఆసరా పింఛన్లు హర్షంబునందగా
బలహీన వర్గాల సంక్షేమం కోరగా
జై తెలంగాణ జైజై తెలంగాణ
జయమని పలకరా నా తెలంగాణ
కోటి రతనాల నా తెలంగాణ
కోటి పథకాల నా తెలంగాణ