విరిగిపోయిన పడవ
ఏ ప్రేమికుల గుర్తో, ఎక్కడి ప్రయాణికుల కలనో, విరిగిపోయిన పడవ సముద్రం ఒడ్డున పడి ఉంది
ఏ ప్రేమికుల గుర్తో,
ఎక్కడి ప్రయాణికుల కలనో,
విరిగిపోయిన పడవ
సముద్రం ఒడ్డున పడి ఉంది
అతడు నేను కవిని అని చెప్పుకోలేదు
బ్యాండేజీ మీద నెత్తురు కనిపించినట్టు,
అందరు అతని కళ్లల్లో కవిత్వం చూశారు
యుద్ధాలు జరిగిన తర్వాత
అతడు కవిత్వం మానేసి,
మనుషులను ప్రేమించడం ముఖ్యమన్నాడు.
అతడు పుస్తకాలు ప్రచురించాడో లేదో తెలియదు కానీ,
ఎవరూ పట్టించుకోని విరిగిన పడవను,
బాగుచేయడం మొదలుపెట్టాడు
ఖైదీలందరూ వాళ్ల వయసు మరిచిపోయి,
చాలా ఏండ్లు గడిచాయి.
వాళ్లు, జైలు గోడలు కూలడం కోసం,
చిన్న పిల్లల్లా, ఇప్పటికీ కలలు గంటూ నిరీక్షిస్తున్నారు
ఎప్పుడో సూర్యుడు కిటికీ మీద,
పక్షులతో కలిసిపోతాడు
అతడు కవిత్వం రాస్తానని, ఎప్పుడూ అనలేదు
చీకట్లో, తుఫానుకు ఎదురుగా వెళ్లి,
దీపాలు పెట్టడానికి కొట్టుకుపోతుంటే తెలిసింది,
వెలుతురే అతడు రాసే కవిత్వమని!
ప్రయత్నమే దాని సౌందర్యమని!!
ఆశారాజు
93923 02245
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

