తొడకొట్టి యుద్ధానికి ఉసిగొలిపితే
మెడలు వంచి గెలుస్తాడు
దాడులు కొనసాగిస్తే
గెలుపు దారిలో సాగిపోతాడు!
భాష వచ్చు భావ ప్రదర్శన తెలుసు
అందరినీ ఏకతాటిగా నిలిపే
ఏకాగ్రత ఉన్నది మిక్కిలిగా
సమస్యలు తెలుసు పరిష్కారమూ వచ్చు!
మతాల చిచ్చులు అభిమతం కాదు
కులాల కుంపట్లు అసలే ఉండవు
సకల జనుల సంఘటితం
పటిష్ఠ భారతం, సోదర భావం!
గల్లీలో ఉంటాము ఢిల్లీలో ఉంటాము
రైతును రాజుని చేస్తామనేది నినాదం
రాష్ర్టాలు సామంత ప్రాంతాలు కాదు
సమతా స్ఫూర్తి పరిపాలన విధానం!
అధికార మార్పిడి రాజకీయ ఎజెండా
ఆర్థిక అభివృద్ధి దేశ విధానం
ప్రచార జెండా చేతిలో గుండె నిండా కోరికతో
పాతుతాడు త్వరలో అధికార జెండా ఢిల్లీలో!
ఉసిగొలిపితే కసిగా ప్రయత్నిస్తాడు
దాడులు జరిపితే ధాటిగా బదులిస్తాడు
కార్యాచరణతో కదన రంగంలోకి!
అనుకున్నది సాధించడం అతనికే సాధ్యం!!
జగ్గయ్య .జి: 98495 25802