పునరపి జననం పునరపి మరణం
జీవితం నీటిబుడగ
రేపు అనేదానికి రూపం లేదు
అనే మాటలు అక్షర సత్యమై
అయినవారితో
వారి చివరిమాటలు ఆలింగనాలూ
నిన్నటి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి
నిశీధిలో దేశం నిదురించగా
భూమి ఆక్రోశానికి మృత్యు నిశ్శబ్దమవగా
ఆకాశహర్మ్యాలు మట్టిదిబ్బలై
నేలతల్లి ఒడిలోకి శాశ్వతంగా..
శిథిల చిత్రాలు చూసి
కడుపంత దుఃఖం నింపుకొని
అయినవారి ఆక్రందనలు
ఖండాలు దాటి ప్రతిధ్వనించాయి
వారి మహాభినిష్క్రమణకు
ప్రపంచం కన్నీరు కార్చింది !!!
– మడిపల్లి హరిహరనాథ్ 96035 77655