బంధాలు
బలోపేతమవ్వాలంటే
ఎవరైనా సరే
వస్తూ పోతూ ఉండాలే!
ఇచ్చి పుచ్చుకోవడం
ఈ దేశపు సంప్రదాయం
వచ్చినప్పుడల్లా
వట్టి చేతుల్తో వచ్చిపోతుంటే
వచ్చిన ప్రతిసారి
నిరాశనే గుమ్మరించిపోతుంటే
ఇక్కడ స్వాగతాలుండవు
ఆశించిన వీడ్కోళ్లుండవు!
కౌగిలింతలు మరిచినవారువస్తే రానీ పోతే పోనీ!
వచ్చినా ఒకటే, పోయినా ఒకటే
కూల్చివేతలు నమ్మినవారితో
కలిసి నిర్మాణాలు కలగనలేం!
వస్తే రానీ, పోతే పోనీ
అగ్ని రాజేయడానికొచ్చాడేమో
అగ్నిమాపక దళమొకటి
సిద్ధంగా ఉంచండి!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261